AP POLITICS: ఏపీలో చల్లబడ్డ రాజకీయం.. కనిపించని ఎన్నికల హడావిడి.. కారణం ఇదే..!

నామినేషన్ల స్వీకరణకు ఇంకా నెలాఖరు దాకా టైమ్ ఉండటంతో.. ప్రచారం కూడా అప్పటి నుంచే మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి మూడు పార్టీలు. ప్రస్తుతం ఏపీలో నియోజకవర్గాల్లో టిక్కెట్లు ప్రకటించిన పార్టీల అభ్యర్థులు తప్ప.. మిగతా రాజకీయ నేతలంతా రెస్ట్ తీసుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2024 | 05:16 PMLast Updated on: Mar 23, 2024 | 6:21 AM

Ap Politics Election Campaign Goes Slow Down Due To This Reason

AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయం చల్లబడింది. ప్రెస్‌మీట్స్ పెట్టి.. మాటల తూటాలు పేల్చడమే గానీ.. జనంలోకెళ్ళి సభలు పెట్టడం లేదు ఏ పార్టీ లీడర్లు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు.. సిద్ధం సభల పేరుతో వైసీపీ, ప్రజాగళం అంటూ టీడీపీ, వారాహి యాత్రలు అంటూ జనసేన తెగ హడావిడి చేశాయి. ఎన్నికల షెడ్యూల్ డేట్స్ ప్రకటించాక నేతలంతా చల్లబడ్డారు. ఏపీలో నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతుండటం.. నామినేషన్ల స్వీకరణకు ఇంకా నెలాఖరు దాకా టైమ్ ఉండటంతో.. ప్రచారం కూడా అప్పటి నుంచే మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి మూడు పార్టీలు.

Annamalai: తమిళ సింగం అన్నామలై గెలుపు ఖాయం.. కోయంబత్తూర్‌ నుంచే పోటీ ఎందుకో తెలుసా..

ప్రస్తుతం ఏపీలో నియోజకవర్గాల్లో టిక్కెట్లు ప్రకటించిన పార్టీల అభ్యర్థులు తప్ప.. మిగతా రాజకీయ నేతలంతా రెస్ట్ తీసుకుంటున్నారు. మొన్నటిదాకా ఆ సభలు.. ఈ సభలు అంటూ.. తమ సభలకు హాజరైన జనం ఇన్ని లక్షలు.. అన్ని లక్షలు అంటూ.. గ్రీన్ మ్యాట్స్‌తో పార్టీలు తెగ హడావిడి చేశాయి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం.. షెడ్యూల్ ప్రకటించాక అందరూ చల్లబడ్డారు. పార్టీల అధినేతలంతా హాయిగా ఏసీ రూముల్లో కూల్ అవుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ఇంకా దాదాపు నెల టైమ్ ఉండటమే ఇందుక్కారణం. మొదటి విడతలోనే పోలింగ్ ఉంటుందని అన్ని పొలిటికల్ పార్టీలు భావించాయి. గతంలో అలాగే జరిగాయి. ఆల్ఫాబెటికల్ ప్రకారం చేసుకున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా వస్తాయని అంచనా వేశారు. కానీ తెలంగాణకు, ఏపీకి కలిపి ఒకే షెడ్యూల్‌లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో పొలిటికల్ లీడర్ల లెక్కలు తారుమారయ్యాయి.

Naga Chaitanya: కథ వేరే ఉంటది.. ‘విరూపాక్ష’ దర్శకుడితో నాగ చైతన్య

అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ, జనసేన అధినేతలు ఈ నెలాఖరు నుంచి జనంలో తిరగాలని డిసైడ్ అయ్యారు. నెలాఖరు నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా నెలాఖరు నుంచే ప్రచారంలోకి దిగుతున్నారు. బీజేపీకి సంబంధించి ఇంకా ఏ స్థానాల్లో పోటీ చేయాలి.. ఎవర్ని నిలబెడతారన్న క్లారిటీ లేక లీడర్స్, కేడర్ అంతా కన్ ఫ్యూజన్‌లో ఉంది. ఏపీ కాంగ్రెస్‌లో కూడా ప్రస్తుతం టూర్స్ తగ్గాయి. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్‌ని అన్ని పార్టీలు లేట్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఎన్నికల ఖర్చులు భరించడమే. రెండు నెలల పాటు ప్రచార ఖర్చు అంటే తడిసి మోపెడవుతుంది. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు కోట్లల్లో డబ్బులు ఖర్చవుతాయి. ఆ భారం రాష్ట్ర స్థాయిలో పార్టీతో పాటు స్థానిక నియోజకవర్గాల అభ్యర్థులపైనా పడుతుంది. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాంలే అని అన్ని పార్టీల లీడర్లు సైలెంట్ అయ్యారు.

నియోజవకర్గాల్లో అభ్యర్థులకు మాత్రం క్యాంపెయిన్ చేయక తప్పడం లేదు. ఎన్నికలు లేటైతే అధికార పార్టీకే టెన్షన్ ఎక్కువ. రాబోయేది ఎండా కాలం. గత ఏడాది సరిగా వర్షాలు లేవు. దాంతో కరెంట్ కోతలు తప్పేలా లేదు. అలాగే ఏపీలో  రాబోయే ప్రభుత్వం ఏది వస్తుందో తెలీదు… అందువల్ల ఈ సంధి పరిస్థితుల్లో … అప్పులు దొరకడం కష్టం. ఈ పరిస్థితుల్లో జనానికి అందాల్సిన పథకాలు రాకపోతే అధికారపార్టీపై జనంలో  వ్యతిరేకిత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి లేట్ షెడ్యూల్ ప్రభావం ఏపీలో అన్ని రాజకీయ పార్టీలపైనా చూపిస్తోంది.