PM MODI-YS JAGAN: చంద్రబాబు, మోదీతో జగన్ మీటింగ్‌.. భేటీలో ఏం జరిగింది.. రాజకీయ సంచలనాలు ఖాయమా..?

పొత్తుల వ్యవహారంలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ అయి ఇలా రిటర్న్ అయ్యారో లేదో జగన్‌ సమావేశం కావడం.. ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ, జనసేన పొత్తుగా 2024ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ కూడా దాదాపు జత కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2024 | 02:38 PMLast Updated on: Feb 09, 2024 | 2:38 PM

Ap Politics Ys Jagan Met Pm Modi After Chandrababu Naidu

PM MODI-YS JAGAN: ప్రధాని మోదీని కలిసిన ఏపీ సీఎం జగన్.. శుక్రవారం గంటన్నరకుపైగా చర్చలు జరిపారు. ప్రత్యేక హోదా, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం నిర్వాసితుల పరిహారంలాంటి వాటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ తర్వాత నిర్మలా సీతారామన్‌ను జగన్‌ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరగా విడుదల చేయాలని కలిశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

Nagababu Anakapally MP :నాగబాబు ఆ స్థానం నుంచే పోటీ ! గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న జనసేన

పొత్తుల వ్యవహారంలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ అయి ఇలా రిటర్న్ అయ్యారో లేదో జగన్‌ సమావేశం కావడం.. ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ, జనసేన పొత్తుగా 2024ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ కూడా దాదాపు జత కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఢిల్లీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమై పొత్తులపై లోతుగా చర్చలు జరిపారు. ఈ చర్చలు దాదాపు సక్సెస్ అయ్యాయనే ప్రచారం జరుగుతున్న వేళ.. జగన్‌ ఢిల్లీ టూర్‌కు వెళ్లడం, మోదీని కలవడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఢిల్లీ టూర్‌ ముగించుకుని చంద్రబాబు ఇలా హైదరాబాద్ వచ్చారో లేదో.. జగన్ ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే.. మోదీకి జగన్ విన్నపాలు వినిపించారని బయటకు వచ్చినా రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

చంద్రబాబును బీజేపీ పెద్దలు పిలిపించుకోవడంతో జగన్‌లో టెన్షన్ స్టార్ట్ అయిందని.. అందుకే హుటాహుటీనా ఢిల్లీ టూర్ షెడ్యూల్ చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు దాదాపు కన్ఫార్మ్ అయిందనే ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పుడు జగన్ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు క్రియేట్ కాబోతున్నాయ్. అసలు జగన్ హస్తిన పర్యటనలో ఏం జరిగింది.. మోదీతో కేవలం రాష్ట్ర సమస్యలు మాత్రమే వివరించారా.. రాజకీయం కూడా చర్చకు వచ్చిందా.. నిజంగా వచ్చి ఉంటే మోదీ రియాక్షన్ ఏంటి.. బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. మొత్తమ్మీద జగన్ పర్యటన.. ఏపీ రాజకీయాల్లో రేపుతోన్న అలజడి అంతా ఇంతా కాదు.