క్షమాపణ చెప్పు రాహుల్: కేటిఆర్ డిమాండ్

రాహుల్ గాంధీకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాసారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో పదేళ్ల విధ్వంసం అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు పిలిస్తే క్షణాల్లో వస్తానన్న రాహుల్ గాంధీ ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారు అని ప్రశ్నించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2024 | 03:02 PMLast Updated on: Nov 04, 2024 | 3:02 PM

Apologize Rahul Ktr Demand

రాహుల్ గాంధీకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాసారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో పదేళ్ల విధ్వంసం అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు పిలిస్తే క్షణాల్లో వస్తానన్న రాహుల్ గాంధీ ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారు అని ప్రశ్నించారు. గాంధీ భవన్ కు కాదు… ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ముందా? అని నిలదీశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పు అని డిమాండ్ చేసారు. ఏడాదిలోనే అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత మీ ప్రభుత్వానిదే అన్నారు.

సబ్బండ వర్గాలను మోసం, నయవంచనకు గురి చేసిన పాపంలో ప్రధాన పాత్ర మీదే అని ఆయన ఆరోపించారు. మీ వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టా అంతా ఉన్నాయన్నారు. పులకేసి మాదిరిగా మీ ముఖ్యమంత్రి ప్రజలను హింసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైడ్రా, మూసీ బాధితులకు వద్దకు వెళ్లాలి అని డిమాండ్ చేసారు. మీ చేతగాని పాలనతో రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న మీ ముఖ్యమంత్రికి ఎందుకు అండగా ఉన్నారన్నారు.

మీ అనుమతితోనే అదానీతో దోస్తీ, మూసీ ప్రాజెక్ట్ చేపడుతున్నారని అభివృద్ది పథంలో ఉన్న తెలంగాణను అవీనీతి తెలంగాణాగా మార్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కెటిఅర్ డిమాండ్ చేసారు. అధికారం కోసం హమీలిచ్చి సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ తరపున మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేఖలో ప్రస్తావించారు.