టన్నెల్‌లో చిక్కుకున్న వారి కోసం ఆక్వా ఐ.. ఏంటీ టెక్నాలజీ.. 8మంది దొరికేసినట్లేనా ?
SLBC టన్నెల్ ప్రమాదం జరిగి వారం రోజులు కావొస్తోంది. ఇప్పటివరకు సొరంగం లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ లభించలేదు. ఆశలు సన్నగిల్లుతున్నాయ్.

SLBC టన్నెల్ ప్రమాదం జరిగి వారం రోజులు కావొస్తోంది. ఇప్పటివరకు సొరంగం లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ లభించలేదు. ఆశలు సన్నగిల్లుతున్నాయ్. అసలు బతికి ఉన్నారా లేదా అనే భయాలు వెంటాడుతున్నాయ్. కొందరు అధికారులైతే చేతులెత్తేశారు కూడా ! ఇలాంటి పరిణామాల మధ్య టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ చేశారు. గ్యాస్ కట్టర్‌తో బోరింగ్ మెషీన్ శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. బురద, మట్టిని లోకో డబ్బాల్లో నింపి.. బయటకు పంపిస్తున్నారు. భారీ మోటార్లతో టన్నెల్ నుంచి సీపేజ్ వాటర్ పంపింగ్ చేస్తున్నారు. శిథిలాలను తొలగించేందుకు రైల్వేశాఖ రంగంలోకి దిగింది.
ప్రత్యేక నిపుణులతో రెండు బృందాలను నియమించింది. ఇక అటు గల్లంతైన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా.. విదేశాల నుంచి ఆక్వా ఐ మెషీన్‌ను తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్. సొరంగం లోపల ఎక్కడున్నా సరే.. ఈ మెషీన్‌లు గుర్తించే అవకాశం ఉంది. దీంతో ఈజీగా జాడ తెలుస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో ఏంటీ మెషీన్ అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. ఆక్వా ఐ అనేది.. అండర్ వాటర్ స్కానర్.. దీన్ని చేతిలో పట్టుకొని ఆపరేట్ చేయొచ్చు. సోనార్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్‌ను ఉపయోగించుకొని.. ఇది ఎదుటి వ్యక్తులు.. లేదంటే ఎదుటి ప్రాణులు, వస్తువుల జాడ గుర్తిస్తుంది. ఈ మెషీన్ నుంచి సోనార్ పల్స్.. అంటే ఒకరకమైన ధ్వనిని విడుదల చేస్తుంది.
అది ఆర్టిఫిషియల్ ఇంటెలెజిన్స్ సాయంతో.. ప్రతిధ్వనిని గుర్తిస్తుంది. మనిషి బాడీని పోలిన ఎకోను.. ఆక్వా ఐ మిషన్ ఈజీగా పాయింట్ ఔట్ చేస్తుంది. ఆ శరీరం ఎక్కడ ఉందో లొకేషన్ తెలిసేలా చేస్తోంది. దీంతో మనిషి జాడను గుర్తించడం ఈజీ అవుతుంది. ఇప్పుడు సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు. వాటర్‌లో డెడ్‌బాడీలు మునిగి ఉంటే.. మ్యాన్యువల్ వాటిని గుర్తించేందుకు చాలా టైమ్ పడుతుంది. ఐతే ఇప్పుడు ఆక్వా ఐ మిషన్‌తో.. ఈజీగా గుర్తించే అవకాశాలు ఉంటాయ్. టైమ్ కలిసి వస్తుంది. రెస్క్యూ టీమ్ ఎక్కువసేపు ప్రమాద స్థలంలో ఉండాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఎస్ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో.. ఆక్వా ఐ మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది.