AR డైరీలో ఇన్ని అక్రమాలా ?

తిరుమల లడ్డూ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త.. చాలా మంది హిందువుల్లో ఆవేశాన్ని కలిగించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 23, 2024 | 02:16 PMLast Updated on: Sep 23, 2024 | 2:16 PM

Are There So Many Irregularities In Ars Diary

తిరుమల లడ్డూ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త.. చాలా మంది హిందువుల్లో ఆవేశాన్ని కలిగించింది. దీంతో తిరుమలకు నెయ్యి సప్లై చేస్తున్న డైరీ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ భారీ స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తిరుమలకు నెయ్యి సప్లై చేసేది ఏ కంపెనీ, దాని ఓనర్స్‌ ఎవరు అనే విషయాలు ఆసక్తిగా మారాయి. నిజానికి చాలా ఏళ్ల నుంచి తిరుమల ప్రసాదం తయారీలో నందిని నెయ్యిని వాడుతున్నారు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలకు నెయ్యి సప్లై చేసే కంపెనీని మార్చారు.

టెండర్లకు పిలిచిన కంపెనీల్లో తక్కువ బిడ్డింగ్‌ చేసిన AR డైరీ కంపెనీకి టెండర్‌ ఇచ్చారు. అప్పటి నుంచి ఇదే కంపెనీ తిరుమలకు నెయ్యి సప్లై చేస్తోంది. తమిళనాడులోని దిండిగల్‌ ప్రాంతంలో ఉన్న ఈ AR కంపెనీని 1995లో ప్రారంభించారు. ఆర్‌.రాజశేఖరన్‌, ఆర్‌.సూర్యప్రభ, ఎస్‌.శ్రీనివాసన్‌ అనే ముగ్గురు వ్యక్తులు ఈ కంపెనీని స్థాపించారు. ఇప్పుడు వాళ్లే ఈ కంపెనీకి డైరెక్టర్లుగా కూడా ఉన్నారు. రోజుకు 3 లక్షల 50 వేల లీటర్ల పాలను ప్రాసెస్‌ చేసే విధంగా భారీ స్థాయిలో దిండిగల్‌లో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఈ కంపెనీలో 2 లక్షల 50 వేల లీటర్లు మాత్రమే ప్రాసెస్‌ చేస్తున్నారు. రాజ్‌, మలబార్‌ అనే పేర్లతో AR డైరీ తన ప్రోడక్ట్‌లను మార్కెట్‌లో అమ్ముతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేర్లు పెద్దగా తెలియకపోయినా.. కేరళ, తమిళనాడులో ఈ బ్రాండ్లకు మంచి మార్కెట్‌ ఉంది. AR డైరీ తిరుమలకు నెయ్యి సప్లై చెయ్యడం ఇదే తొలిసారి.

కర్నాటక ప్రభుత్వ ఆధీనంలో తయారవుతున్న నందిని నెయ్యికి 2019లో రేట్లు పెంచేశారు. దీంతో తిరుమల లడ్డూ తయారీ కాస్ట్‌ కూడా పెరిగింది. ప్రతీసారి టెండర్లకు పిలిచినట్టే TTD నెయ్యి సప్లై చేసేందుకు టెండర్లు పిలించింది. ఆ టెండర్లో AR కంపెనీ కూడా బిడ్‌ వేసింది. నందినితో కంపేర్‌ చేస్తే తక్కువ రేట్‌కు నెయ్యి సప్లై చేసేందుకు ముందుకు రావడంతో AR డైరీ కంపెనీని అప్పటి ప్రభుత్వం ఫైనల్‌ చేసింది. మొత్తం 8 లక్షల 50 వేల కేజీల నెయ్యి తిరుమలకు AR డైరీ సప్లై చేయాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కలుస్తోందని రిపోర్ట్‌ రావడంతో ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. ఈ ఆరోపణలతో ఫుడ్‌ సేఫ్టీ సాండర్డ్స్‌ అధికారులు AR డైరీ నుంచి శాంపిల్స్‌ తీసుకున్నారు. ఆ రిపోర్ట్‌ ఆధారంగా కంపెనీ మీద చర్యలు తీసుకోబోతున్నారు.