Top story: వైసిపి, బి ఆర్ ఎస్ భ్రమలో ఉన్నారా? పవర్ కోసం అల్లాడిపోతున్నారా?

మూడేళ్లలో మేము పవర్ లోకి వస్తున్నాం.... మీ సంగతి చూస్తాం.ఇంకా నాలుగేళ్ల టైముంది. కళ్ళు మూసుకుంటే నాలుగు రోజులగా అయిపోతాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2025 | 10:45 AMLast Updated on: Apr 07, 2025 | 10:45 AM

Are Ycp And Brs Deluded Are They Struggling For Power

మూడేళ్లలో మేము పవర్ లోకి వస్తున్నాం…. మీ సంగతి చూస్తాం.ఇంకా నాలుగేళ్ల టైముంది. కళ్ళు మూసుకుంటే నాలుగు రోజులగా అయిపోతాయి. మళ్లీ మనమే పవర్ లోకి వస్తాం .రాగానే వాళ్ల తోలు తీస్తాను. ఆ ఎస్ ఐ పేరు గుర్తుపెట్టుకోండి…. మూడేళ్ల తర్వాత పవర్ లోకి రాగానే వాడిచేత మీకు సెల్యూట్ కొట్టిస్తా. తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య బాగా వినబడుతున్న మాటలు ఇవి. ఏపీలో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు… మూడేళ్లలో పవర్ లోకి వచ్చేస్తాం… రాగానే వాడి సంగతి చూస్తాం. వీడి సంగతి చూస్తాం…. అది కట్టిస్తాం…. ఇది పడగొడతాం అని హామీల మీద హామీలు ఇస్తున్నారు.

అపోజిషన్ లో ఉన్న ఈ పొలిటికల్ పార్టీల ధైర్యం ఏమిటో మాత్రం ఎవరికి అర్థం కావటం లేదు. క్యాడర్ లో ఊపు తేవడానికి , నమ్మకం కలిగించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా….? లేక అధికార పక్షాన్ని బెదిరించి… మైండ్ గేమ్ ఆడుతున్నారా అన్నది జనంలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని అనిపిస్తే ఆ తప్పుని అడ్డుకోవడంపై విపక్షాలు దృష్టిపెట్టడం లేదు. మేము వచ్చాక అలా చేస్తాం, ఇలా చేస్తాం అని బెదిరించడం చాలా మామూలు అయిపోయింది. అంటే మూడేళ్ల తర్వాత వీళ్ళు వస్తే మళ్లీ పగ ప్రతీకారాలు కొనసాగుతాయన్నమాట.

ఇప్పుడు వాళ్ళని వీళ్ళు వేసుకుంటారు. మూడేళ్ల తర్వాత వీళ్లు వాళ్ళని వెంటాడుతారు అన్నమాట. అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అన్నది పొలిటికల్ పార్టీలేవి చెప్పడం లేదు. రెండు మూడేళ్లలో మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం…. మేము ఆ బుక్ లో రాస్తున్నాం… ఈ బుక్ లో రాస్తున్నాం. రాగానే వాళ్ల సంగతి చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఒక రౌడీ గ్యాంగ్ లాగా తయారయ్యాయి. అసలు వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కాదు. ముఖ్యంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరో నెలలోనే మొదలుపెట్టేశారు. నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాం. రాగానే వాళ్ల సంగతి చూస్తాం. ప్రభుత్వానికి నాలుగున్నర సంవత్సరాలు సమయం ఉంది.164 సీట్లు ప్రభుత్వానికి ఉన్నాయి. నాలుగేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఎవడికి ఏం తెలియదు. అసలు ప్రభుత్వం ఏర్పడి ఇంకా 9 నెలలు మాత్రమే అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడే తొందరపడి పోతున్నాడు. నాలుగేళ్లలో మనమే అధికారంలోకి రాబోతున్నాం రాగానే…. వాడి సంగతి తెలుస్తాను. వీడి సంగతి తెలుస్తాను అని హెచ్చరిస్తూ ఉంటారు. ముఖ్యంగా పోలీసు అధికారుల్ని…. జగన్ పేరు పెట్టి మరి ఓ వీధి రౌడీలాగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు.

సరే కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ నింపడానికి…. మనం అధికారంలోకి రాబో తున్నాం ధైర్యంగా ఉండండి అని చెప్పొచ్చు. ప్రభుత్వాలు నిన్ను గాక మొన్న ఏర్పడ్డాయి. ఆంధ్రాలో గట్టిగా 9 నెలలు అవ్వలేదు.
అప్పుడే జగన్ 2029 లో నేనే అధికారంలోకి వస్తానని పాట పాడుతున్నాడు. ఆయనకు అంత తొందర ఎందుకో అర్థం కాదు. అధికారం లేకుండా ఉండలేకపోతున్నాడా? లేక నిత్యం భ్రమల్లో…. ఊహల్లో బతుకుతున్నాడ?

ఇక తెలంగాణ విషయానికొస్తే బి ఆర్ ఎస్ అంచనాలకు మించి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలు బి ఆర్ఎస్ లో విశ్వాసాన్ని నింపేసేయ్. ఎన్నికలకు ఇంకా మూడున్నర సంవత్సరాలు సమయం ఉంది. అయినా సరే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆగలేకపోతున్నారు. అసలు రేపు ఎల్లుండో ఎన్నికలు జరిగిపోతున్నట్టు …. తాము తిరిగి అధికార పీఠాల్లోకి ఎక్కి కూర్చున్నట్లు వీరావేశంతో హామీలు ఇస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ స్థలం విషయంలో
ఒక పక్క ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వివరణ ఇస్తుండగానే…. మరోవైపు కేటీఆర్ కాంగ్రెస్ ఏం మాయ చేసినా సరే అక్కడ స్థలాలు ఎవరూ కొనవద్దు. మరో మూడు ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది… ఆ స్థలాన్ని మేము వెనక్కి లాక్కుంటాం అని హెచ్చరిస్తారు. ఆ 400 ఎకరాలు మన ప్రభుత్వం ఎకో పార్క్ కట్టిస్తుంది హామీ ఇచ్చేస్తారు.

ఆంధ్ర, తెలంగాణలో ప్రతిపక్షాల ధైర్యం ఏంటో అర్థం కాదు. గతంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాము. ముఖ్యమంత్రిగా పని చేసాము. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము. మర్యాదగా మాట్లాడాలి. అన్న ధ్యాస ఏ కొసానా లేదు. మూడేళ్లలో మేం అధికారంలోకి వస్తున్నాము. నాలుగేళ్లలో పవర్ లోకి వస్తాము. వాడి తోలు తీస్తాము. వీడు తోలు తీస్తాము. ఆ బుక్ లో రాస్తున్నాము… ఈ బుక్ లో ఎక్కిస్తున్నాము…. ఇలా ఒక రౌడీ గ్యాంగులు తరహాలో హెచ్చరికలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకార రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.

దీనికి ప్రధాన కారణం ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లకు మించి ఉన్నదని అందరి నమ్మకం. వేలకోట్ల రూపాయలు అప్పులు తెచ్చి… సంక్షేమ పథకాల అమలు చేస్తూ…. ప్రజలను సంతృప్తి పరచలేక కచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా ఐదేళ్లకు ఓడిపోక తప్పదు…. కనుక జనం ప్రచారం న్యాయంగా మళ్ళీ మనకే ఓటేస్తారు…. అందుకే అధికారం మనకు వచ్చేస్తుంది అనే ధీమాతో…. ఓడిపోయిన మరుసటి రోజు నుంచే సిగ్గు ఎగ్గు లేకుండా మళ్లీ మనదే అధికారం అని చెప్పు తిరుగుతుంటాయి పార్టీలు. అసలు ప్రజలు మనల్ని ఎందుకు ఓడించారు…. వేరే వాళ్ళకి ఎందుకు అధికారమిచ్చారు అన్న సమీక్ష చేయకుండా… ప్రభుత్వాలకి ఏడాది నిండకుండానే వీళ్లు వచ్చే ఎన్నికల్లో మాదే అధికారంలో ప్రకటనలు చేస్తున్నారు.