తిరుమల వచ్చే భక్తులు కచ్చితంగా టికెట్ లు టోకెన్ లు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. రాబోయే పది రోజుల పాటు తిరుమలలో స్పెషల్ దర్శనాలు ఉండవని ప్రకటించారు. స్పెషల్ దర్శనాలు ఉండవని.. సామాన్య భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గోవింద మాల ధరించిన భక్తులు కూడా సామాన్య భక్తుల మాదిరిగానే రావాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనం గూర్చి మాట్లాడుతున్నారని.. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉ 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుందని వివరించారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజులు రద్దు చేసినట్టు వివరించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి అదేశాల ప్రకారం సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. [embed]https://www.youtube.com/watch?v=wuYpjdCrX6o[/embed]