Jeevan Reddy: భారీ ఝలక్.. ఆర్మూరు పాండుకు దిమ్మదిరిగే షాక్..
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి.. ఎంపీ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని కారు పార్టీ వ్యూహాలు రచిస్తుంటే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. గత ఎన్నికల్లోనే ఈ స్థానాన్ని బీజేపీకి కోల్పోయింది బీఆర్ఎస్.
Jeevan Reddy: పార్లమెంట్ ఎన్నికల వేళ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతుతున్నాయ్. ఆర్మూరు బీఆర్ఎస్ పార్టీకి బీటలు వారాయ్. ఏకంగా 17మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పండిత్ వినిత పవన్ తీరుపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్న కార్పొరేటర్లు.. హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.
CHANDRABABU NAIDU: ఉత్తరాంధ్రపై కాదు.. జగన్‌కు భూముల మీదే ప్రేమ: చంద్రబాబు
ఐతే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే చైర్‌పర్సన్‌ను మార్చాలని ఒక వర్గం కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్పటి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కార్పొరేటర్లను బుజ్జగిస్తూ ముందుకు వెళ్లారు. చైర్‌పర్సన్ తీరుతో పార్టీకి నష్టం వస్తోందని.. ఇంటి నెంబర్ల జారీలో, అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ముందునుంచీ ఆరోపణలు చేస్తున్నారు. ఐతే బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. ఈ మధ్య నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలోనూ చైర్ పర్సన్ విశ్వాస పరీక్ష గెలిచి పీఠం కైవసం చేసుకున్నారు. ఐతే ఇప్పుడు మున్సిపాలిటీలోని 17మంది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుతో పాటు మొత్తం 17 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి.. ఎంపీ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని కారు పార్టీ వ్యూహాలు రచిస్తుంటే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. గత ఎన్నికల్లోనే ఈ స్థానాన్ని బీజేపీకి కోల్పోయింది బీఆర్ఎస్. ఐతే ఇప్పుడు ఇలాంటి పరిణామాల మధ్య.. కనీసం పోటీ అయినా ఇవ్వగలదా అనే అనుమానాలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయ్.