అరెస్ట్ టూ బెయిల్, హైకోర్ట్ లో వాదనలు ఎలా జరిగాయి…?

అల్లు అర్జున్ క్వాష్ పిటీషన్ పై తెలంగాణా హైకోర్ట్ లో వాడీ వేడీగా వాదనలు జరిగాయి. ప్రభుత్వ అడ్వకేట్, అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి మధ్య ఓ రకంగా మాటల యుద్దమే జరిగింది కోర్ట్ వేదికగా. అసలు కోర్ట్ లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2024 | 12:49 PMLast Updated on: Dec 14, 2024 | 12:49 PM

Arrest To Bail How Were The Arguments In The High Court

అల్లు అర్జున్ క్వాష్ పిటీషన్ పై తెలంగాణా హైకోర్ట్ లో వాడీ వేడీగా వాదనలు జరిగాయి. ప్రభుత్వ అడ్వకేట్, అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి మధ్య ఓ రకంగా మాటల యుద్దమే జరిగింది కోర్ట్ వేదికగా. అసలు కోర్ట్ లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం.

అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో షారుక్‌ఖాన్‌ కేసును ప్రస్తావించిన నిరంజన్‌రెడ్డి రేస్‌ సినిమా ప్రమోషన్‌లోనూ తొక్కిసలాట జరిగిందని, ఆ కేసులో గుజరాత్‌ హైకోర్టు.. సుప్రీంకోర్టు కూడా షారుక్‌ఖాన్‌కు రిలీఫ్‌ ఇచ్చాయని తొక్కిసలాటతో బన్నీకి నేరుగా సంబంధం లేదని వాదనలు వినిపించారు. హీరో వస్తే మరణాలు ఉంటాయని ఎక్కడా… SHO హెచ్చరించలేదని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

అలాగే బాధితుడు ఇచ్చిన్ ఫిర్యాదు లో నో ప్రాపర్ ఫెసిలిటీస్ అని రాశాడు అని… FIR లో ప్రీమియర్ షో కు ఎలాంటి అనుమతి తీసుకోలేదు అని పోలీసులు రాశారని… కానీ డిసెంబర్ 2 న పోలీస్ బందోబస్తు కోసం పోలీసులకు లేఖ రాశామని కోర్ట్ కు తెలిపారు. ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు కాబట్టి బందోబస్తు కావాలని రిలీజ్ కు రెండు రోజులు ముందు కోరామని చెప్పగా… మీరు ఇచ్చిన లేఖ ను పోలీసులు గుర్తించారా అని హైకోర్ట్ ప్రశ్నించింది. దీనితో చిక్కడపల్లి ఏసిపి సంతకం చేసిన కాపీ ని కోర్టు కు సబ్మిట్ చేసారు అల్లు అర్జున్ అడ్వకేట్.

పోలీసులు నిర్లక్ష్యం అనే పదాన్ని పదే పదే రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారని… కోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళగా… కోర్ట్ ప్రభుత్వ లాయర్ ను ఉద్దేశించి… మీరు అనుమతి తీసుకున్నాక , సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఎక్కడుంది అంటూ ప్రశ్నించింది. అల్లు అర్జున్ పై ఉన్న ఆరోపణ ఏంటని ప్రభుత్వ లాయర్ ను హైకోర్ట్ ప్రశ్నించింది. థియేటర్ కు వెళ్ళడానికి ఆయన సినిమా నటుడు, అనుమతి తీసుకున్నాడు కదా అని కోర్ట్ ప్రశ్నించగా… అనుమతి తీసుకున్నప్పటికీ, హీరో హీరోయిన్ లను థియేటర్ కు పిలవద్దు అని పోలీసులు థియేటర్ యాజమాన్యం కు లేఖ రాశారని కోర్ట్ ముందు వాదన వినిపించారు.

మరి థియేటర్ యాజమాన్యం హీరో కు ఈ విషయం చెప్పారా… ఒకవేళ చెబితే ఎలా చెప్పారు… కాపీ ఏమైనా ఉందా అని హై కోర్టు ప్రశ్నించింది. ఇక దీనికి ప్రభుత్వ లాయర్ మాట దాటవేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ ను రిమాండ్ చేశారు కాబట్టి క్వాష్ పై సోమవారం వాదనలు వినండని ప్రభుత్వ న్యాయవాది కోర్ట్ ను కోరారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న అల్లు అర్జున్ లాయర్… ఒకవేళ కిoది కోర్టు అల్లు అర్జున్ ను రిమాండ్ చేసినా, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు అని నిరంజన్ రెడ్డి కోర్ట్ ముందు తన వాదన వినిపించారు.

పలు సుప్రీం కోర్టు జెడ్మెంట్ లు ఉన్నాయని… షారుక్‌ఖాన్‌ కేసు రైజ్‌ చేసారు. ఇక తొక్కిసలాట సమయంలో హీరో అల్లు అర్జున్‌… ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్నాడని… కానీ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో తొక్కిసలాట జరిగిందన్నారు. అక్కడ ఆమె చనిపోయిందని కోర్ట్ కు తెలిపారు. అర్నాబ్‌ గోస్వామి కేసును కోట్‌ చేస్తూ… ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. నిర్మాత కూడా థియేటర్‌కు హీరో వస్తున్నట్లు లేఖ రాశారని… గతంలో ఏపి లో జరిగిన పుష్కరాల కేస్ గురించి హైకోర్టు లో ప్రస్తావించారు నిరంజన్ రెడ్డి.

గతంలో ఏపి లో జరిగిన పుష్కరాల కేస్ ప్రస్తావించారు. పుష్కరాల సమయంలో అప్పుడు సిఎంగా చంద్రబాబు అక్కడే ఉన్నారన్నారు. తొక్కిసలాట కారణంగా 35 మంది మరణించారని… ఆ సందర్భంగా లో అక్కడ ఉన్న వారిని అరెస్ట్ చేయలేదు కదా అని నిరంజన్ రెడ్డి కోర్ట్ ముందు వాదనలు వినిపించగా రెండు కేసులు పూర్తిగా భిన్నం అని కోర్ట్ వ్యాఖ్యానించింది. ఇక అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్ట్ వాదనలను ముగించింది. హీరో అయినంత మాత్రాన వ్యక్తిగత స్వేచ్చ ఉండదా అని ప్రభుత్వ లాయర్ ను ఉద్దేశించి ప్రశ్నించింది కోర్ట్.