ARTICLE 370: ఆర్టికల్ 370 ఎప్పుడొచ్చింది..? ఎందుకు రద్దు చేశారు..? ఆసక్తికర విషయాలివే..
1949 జూలైలో జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370కి అప్పటి కేంద్రం ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని 21వ భాగంలో ఆర్టికల్ 370 ఉంది. దీని ప్రకారం జమ్ము కాశ్మీర్ భారత్‌లో అందర్భాగమే అయినప్పటికీ ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక రాజ్యాంగం, జెండా, చట్టాలు వంటివి అమలులో ఉంటాయి.
ARTICLE 370: జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దును సుప్రీం కోర్టు సమర్ధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370కి సంబధించిన కీలక అంశాలేంటో తెలుసుకుందాం.
1949 జూలైలో జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370కి అప్పటి కేంద్రం ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని 21వ భాగంలో ఆర్టికల్ 370 ఉంది. దీని ప్రకారం జమ్ము కాశ్మీర్ భారత్‌లో అందర్భాగమే అయినప్పటికీ ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక రాజ్యాంగం, జెండా, చట్టాలు వంటివి అమలులో ఉంటాయి. అక్కడి రక్షణ, సమాచారం, ఆర్థిక, విదేశీ వ్యవహారాల్లో మాత్రమే భారత ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. మిగతా రంగాల్లో ఏం చేయాలన్నా అక్కడి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. విదేశీ దురాక్రమణలు, యుద్ధం వంటి సందర్భాల్లో తప్ప ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీనగర్ ఆక్రమించేందుకు పాకిస్తాన్ కుట్రపన్నింది.
ARTICLE 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. ప్రధాని స్పందన ఇదే..!
దీంతో కాశ్మీర్ రాజు హరి సింగ్ కొన్ని ఒప్పందాలతో తన సంస్థానాన్ని 1948 అక్టోబర్ 27న మన దేశంలో విలీనం చేశారు. అప్పట్లో ఆ రాష్ట్ర ప్రధానిగా షేక్ అబ్దుల్లా, రాజ ప్రతినిధిగా హరి సింగ్ కుమారుడ్ కరణ్ సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. కాశ్మీర్‌కు తాత్కాలిక పద్ధతిలో స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుని, ఆర్టికల్ 370ని చేర్చారు. దీన్ని 1956 నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లో శాశ్వత నివాసానికి సంబంధించి ఆర్టికల్ 370లో 35 (ఏ)ను నెహ్రూ సూచన మేరకు చేర్చారు. ఈ నిబంధన ప్రకారం.. కాశ్మీరేతరులు ఎవరూ ఆ ప్రాంతంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగం, ఓటు వేయడానికి అనర్హులు. 1954కు ముందు పదేళ్లు అక్కడ స్థిర నివాసం ఉన్నవారికి మాత్రమే అక్కడి స్థానికులుగా గుర్తిస్తారు. వారికి మాత్రమే కశ్మీర్ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు అర్హులు. అలాగే కాశ్మీర్ మహిళలు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నా కూడా వారు స్థానికత, ఆస్తి హక్కులు కోల్పోతారు. అయితే, 2002లో అప్పటి ప్రభుత్వం మహిళలకు ఆ హక్కు తిరిగి కల్పించింది.
జమ్ము కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగానే 2019 ఆగష్టు 5న ఆర్టికల్ 370, 35(ఏ)ను కేంద్రం రద్దు చేసింది. అదే సంవత్సరం నవంబర్ 3న.. జమ్ము కాశ్మీర్, లదాక్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కేంద్రం నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు వెల్లడించింది.