నా కొడుకుని వదిలేయమను… దిల్ రాజుతో పోలీసులకు అరవింద్ రాయబారం
తెలంగాణ ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ గోక్కోవడం అనేది కచ్చితంగా కంగారు పడాల్సిన విషయమే. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ముఖ్యంగా పోలీసులకు చిరాకు తెప్పించాయి అనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.
తెలంగాణ ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ గోక్కోవడం అనేది కచ్చితంగా కంగారు పడాల్సిన విషయమే. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ముఖ్యంగా పోలీసులకు చిరాకు తెప్పించాయి అనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. వివాదం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పెద్దది చేయకుండా కూల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పోలీసులను కూల్ చేయడానికి అల్లు అరవింద్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అలాగే సినిమా పరిశ్రమ విషయంలో పోలీసులు కఠినంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్లని ఏదో ఒక రకంగా తమ వైపు చూడకుండా ఉండేందుకు తాను చేయాల్సింది తాను చేస్తున్నారు. త్వరలో భారీ బడ్జెట్ సినిమాలో రిలీజ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే కచ్చితంగా అల్లు అరవింద్ ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉండవచ్చు. కాబట్టి తన వంతు ప్రయత్నాలు అల్లు అరవింద్ స్ట్రాంగ్ గానే చేయడం మొదలుపెట్టారు.
తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు శుక్రవారం తెలంగాణ హోంశాఖ స్పెషల్ సెక్రటరీ ఐపీఎస్ ఆఫీసర్ రవి గుప్తాతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రోగ్రామ్స్ గురించి ఆయనకు వివరించారు దిల్ రాజు. అదేవిధంగా కొత్త థియేటర్లో లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ ఈజీ అయ్యేవిధంగా సహకరించాలని ఆయనను కోరారు.
ఒకవేళ షరతులతో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతిస్తే పోలీసు శాఖ సహకారం కావాలని భద్రతా చర్యల విషయంలో పోలీసులు పూర్తిస్థాయిలో సహకరించాలని.. త్వరలోనే మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పోలీస్ శాఖ నుంచి తమకు మరింత భద్రత కావాలని ఆయన కోరినట్లు కథనాలు వస్తున్నాయి. అలాగే ఈ మీటింగ్ లో అల్లు అర్జున్ గురించి కూడా వీళ్ళ మధ్య ప్రస్తావన వచ్చింది. బాధిత కుటుంబానికి సినిమా పరిశ్రమ నుంచి చేయాల్సిన సహాయం చేశామని కాబట్టి పోలీసులు కూడా ఈ విషయంలో పట్టుదలగా వెళ్లకుండా ఉండాలని దిల్ రాజు రిక్వెస్ట్ చేశారట.
అల్లు అర్జున్ కు లేటెస్ట్ గా నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పోలీసులు పిటిషన్ వేసే ఛాన్స్ ఉందని వార్తలు కూడా వచ్చాయి. అందుకే దిల్ రాజు ద్వారా పోలీస్ శాఖను కూల్ చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేసుకుని ఆయన్ను రంగంలోకి దించారు. తాము పోలీసులతో వివాదం కోరుకోవడం లేదని కాబట్టి పోలీసులు కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేశారట దిల్ రాజు.