JAGAN CBN LEKKALU : జగన్ 150+… బాబు 120 +… కేడర్ కి క్లారిటీ ఇచ్చిన ఆ ఇద్దరు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ఫలితాలు రావడానికి ఇంకా ఎన్నో రోజులు టైమ్ లేదు. దాంతో తమ పార్టీ నేతలు, అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ (Jagan), చంద్రబాబు (Chandrababu) ప్రయత్నిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ఫలితాలు రావడానికి ఇంకా ఎన్నో రోజులు టైమ్ లేదు. దాంతో తమ పార్టీ నేతలు, అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ (Jagan), చంద్రబాబు (Chandrababu) ప్రయత్నిస్తున్నారు. తమకు మెజారిటీ ఎంత వస్తుందో లెక్కలేసి చెబుతూ కేడర్ కు భరోసా ఇస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ (Lok Sabha Elections) సీట్లకు కౌంటింగ్ డేట్ దగ్గరపడటంతో విదేశాలకు వెళ్ళిన లీడర్లు ఒక్కొక్కరు ఇళ్ళకు చేరుతున్నారు. అమెరికా నుంచి ముందుగా వచ్చిన చంద్రబాబుకు నేతలు, అభిమానుల తాకిడి కనిపిస్తోంది. టీడీపీ కూటమి (TDP Alliance) కి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సుందో అంచానా వేశారు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు. పోలింగ్ సరళిని చూస్తే… కూటమికి 120కి పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు పార్టీ అనుచరులతో చెప్పినట్టు తెలుస్తోంది. జనసేన కూడా మెజారిటీ సీట్లల్లో గెలుస్తోందనీ… వైసీపీ ఎన్ని కుయుక్తులు చేసినా టీడీపీ శ్రేణులు కలసి కట్టుగా ఎదురించారని చెప్పినట్టు సమాచారం. అందుకు మాచర్ల, తాడిపత్రి సంఘటనలే ఉదాహరణ అన్నారు బాబు. ఈసారి వైసీపీకి 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అభిప్రాయపడినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
అమెరికాకు వెళ్ళకముందే…తాము 150కు పైగా సీట్లల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఎంపీ సీట్లు 22 దాటుతాయని కూడా చెప్పేశారు. అప్పటి నుంచి వైసీపీ కేడర్ ధీమాగా ఉంది. పోలింగ్ రోజున ఐదు సర్వే సంస్థలతో పాటు మరో రెండు మార్గాల్లో పూర్తి సమాచారం సేకరించి జగన్ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్… వైసీపీ ముఖ్యనేతలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. తాను చెప్పిన నెంబర్ పక్కాగా వస్తుందని ధీమా వ్యక్తం చేసినట్టు నేతలు చెబుతున్నారు. జగన్ సన్నిహిత నేతలు మాత్రం… వైసీపీకి 150 కాకున్నా… 110 కి పైగా సీట్లు వస్తాయని అంటున్నారు. మహిళా ఓటర్లు తమకే ఓట్లేశారనీ… గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పోలింగ్ జరగడంతో అది లబ్దిదారుల రూపంలో వైసీపీకి ప్లస్ అయిందని అంటున్నారు. అంటే టీడీపీ 120 ప్లస్ అని ధీమాగా ఉంటే… వైసీపీ నేతలు తమకు 110 ప్లస్ అని చెబుతున్నారు. ఈ ఇద్దరి అంచనాల్లో ఏవి కరెక్ట్ అవుతాయాన్నది జూన్ 4న మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది.