ASSEMBLY ELECTIONS: ఈ జంప్ జిలానీలకు ఇబ్బందే ! కాంగ్రెస్ అభ్యర్థుల గట్టి పోటీ..
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీళ్ళల్లో 12 మంది బీఆర్ఎస్‌లో చేరారు. పైగా తమ శాసనసభా పక్షాన్ని విలీనం చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. వీళ్ళు కాకుండా ఖమ్మం జిల్లాలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే చేరారు.
ASSEMBLY ELECTIONS: ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జంప్ జిలానీలకు తమ నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. 2018లో కాంగ్రెస్, టీడీపీ నుంచి 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కారు పార్టీలో చేరారు. వీళ్ళల్లో 13 మందికి టిక్కెట్లు ఇచ్చారు సీఎం కేసీఆర్. వీళ్ళందరికీ ఆయా నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. దాంతో ఈసారి గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు జంపింగ్ ఎమ్మెల్యేలు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీళ్ళల్లో 12 మంది బీఆర్ఎస్‌లో చేరారు. పైగా తమ శాసనసభా పక్షాన్ని విలీనం చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. వీళ్ళు కాకుండా ఖమ్మం జిల్లాలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే చేరారు.
Priyanka Gandhi: ధరణి పోర్టల్‌తో భూములు లాగేసుకుంటున్నారు.. ఫాంహౌజ్ పాలన అవసరమా..?: ప్రియాంకా గాంధీ
కాంగ్రెస్, టీడీపీ నుంచి జంప్ చేసిన 14 మందిలో 13 మందికి కేసీఆర్ ఈసారి టిక్కెట్లు ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన వాళ్ళంతా ద్రోహులనీ.. వాళ్ళని మళ్ళీ అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయబోమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీని మోసం చేసిన వారిని ఓడిస్తామని.. ఆయా నియోజకవర్గాల్లోని హస్తం పార్టీ ఎమ్మెల్యేలు కూడా గట్టిగా చెబుతున్నారు. దాంతో వీళ్ళకి విజయం అంత ఈజీ అయ్యేలా లేదు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారామని సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. కానీ, ప్యాకేజీల కోసమే కారు ఎక్కారన్న ఆరోపణలను కాంగ్రెస్ లీడర్లు ప్రచారం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్‌లోకి జంప్ అయిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ మాత్రమే BRS పార్టీ నుంచి గెలిచారు.
అయితే ఆ జిల్లాలో పదికి పది కాంగ్రెస్ గెలుస్తుందనీ.. ఒక్క BRS అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని పాలేరు నుంచి పోటీలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే శపథం చేశారు. ఆ జిల్లాలో బలమైన నాయకులైన భట్టి, తుమ్మల, పొంగులేటి.. కాంగ్రెస్‌లో ఉండటంతో కాంగ్రెస్ 10కి 10 గెలిచేలా పోరాడుతోంది. కొత్తగూడెంలో పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పోటీలో ఉన్నారు. అయితే అక్కడ కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌కి వెళ్ళిన సిట్టింగ్ MLA వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన కొడుకు రాఘవ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ కుటుంబం ఆత్మహత్య కూడా చేసుకుంది. ఇదే కాకుండా రాఘవ రౌడీయిజం, భూకబ్జాలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ జిల్లాలో బీఆర్ఎస్‌లోకి మారిన అభ్యర్థులందరికీ ఇబ్బందిగానే ఉంది. ఇతర జిల్లాల్లో పోటీలో ఉన్న చిరుమర్తి లింగయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, సబితా, గండ్ర వెంకట రమణారెడ్డి.. ఇలా జంపింగ్ అయిన 14 మందికీ ఆయా నియోజవర్గాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. సో.. ఈసారి జంపింగ్స్ గెలిచే అవకాశాలు తక్కువే అంటున్నారు విశ్లేషకులు.