ASSEMBLY ELECTIONS: రైతు బంధు చుట్టూ రాజకీయం.. ఇంతకీ దీన్ని ఆపిందెవరు..?
తెలంగాణ అసెంబ్లీ సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉన్న వేళ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయం రైతు బంధు చుట్టూ తిరుగుతోంది.
ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి.. రైతుబంధు అనుమతిని రద్దు చేసింది. దీంతో.. ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం రైతుబంధు చుట్టూ తిరుగుతోంది. పార్టీల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. దీనికి కారణం మీరే అంటే మీరే అంటూ పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. జనాల ముందు ప్రత్యర్థి పార్టీతని దోషిగా నిలబెట్టేందుకు ట్రై చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉన్న వేళ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయం రైతు బంధు చుట్టూ తిరుగుతోంది.
రైతుబంధుపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని గంటల వ్యవధిలోనే తాను ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంది. దీంతో.. రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ ఆగిపోయింది. ఈ నెల 28లోపు రైతు బంధు పంపిణీకి ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వానికి అనుమతిచ్చింది ఈసీ. అయితే.. ఆ అనుమతి ఇచ్చిన కొన్నిగంటల్లోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎన్నికల కోడ్ ఉల్లఘించారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో అనుమతిని వెనక్కి తీసుకున్నట్లుగా ఈసీ ప్రకటించింది. రైతు బంధు ఉపసంహరణపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. “రైతు బంధు డబ్బులు.. రైతు ఖాతాల్లో పడతాయని.. నవంబర్ 28వ తేదీ ఉదయమే రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వస్తాయని.. ఇది బీఆర్ఎస్ పార్టీ.. సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుంది” అంటూ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట ఎన్నికల సభలో వ్యాఖ్యలు చేశారు. రైతు బంధును ఎన్నికల ప్రచారంగా వాడుకోవటంపై అభ్యంతరాలు రావటంతో.. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్ పరిశీలించింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కార్మికులతో సీఎం సమావేశం: రాహుల్‌గాంధీ
ఈ కామెంట్స్ ఎన్నికల రూల్స్‌కు విరుద్ధమని ఈసీ తెలిపింది. వెంటనే రైతుబంధు నిధుల విడుదల ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే.. ఈసీ నిర్ణయం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈసీ ప్రకటన వచ్చిన వెంటనే సీఈవో వికాస్‌రాజ్‌ను కలిశారు బీఆర్‌ఎస్ ఎంపీ కేకే. రైతుబంధు స్కీమ్‌ను ఎలక్షన్ కోడ్ అయ్యేవరకు బ్యాన్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా స్కీమ్‌ను ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. ఇంతకీ రైతుబంధు ఆపిందెవరు.. ఇదే విషయంపై తెలంగాణలో ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ చేసిన కంప్లైంట్ వల్లే రైతుల ఖాతాల్లో పడాల్సిన నిధులు ఆగిపోయాయంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కానీ.. ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్లే ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందంటూ కాంగ్రెస్ కౌంటరిస్తోంది. రైతుబంధుకు పర్మిషన్ ఇచ్చినప్పుడు కొన్ని షరతులు పెట్టింది ఈసీ. అయితే.. ఎన్నికల ప్రచారంలో పదే పదే ఈ అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావించింది. దీంతో.. విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి.
దీంతో.. రైతుబంధుకు బ్రేక్ పడటం.. ఆ వెంటనే అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలడం వెంట వెంటనే జరిగిపోయాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మాటలను పక్కనబెడితే.. ఈ వ్యవహారం మాత్రం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. రబీ పంట సీజన్ కూడా మొదలైంది. పెట్టుబడి సాయం సరైన సమయంలో అందిందే రైతులకు ఎంతో కొంత ఊరటగా ఉంటుంది. కానీ.. ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈసీ తీసుకున్న నిర్ణయంతో రైతులు నిరాశకు గురయ్యారు.