శంభాజీ పాపమే తగిలింది.. చివరి దశలో నరకం చూసిన ఔరంగజేబు..
ఔరంగజేబు.. క్రూరుడు, మూర్ఖుడు. దండయాత్రలు, యుద్ధాలు మాత్రమే తెలిసిన రాక్షసుడు. ఇస్లాం మతాన్ని విస్తరించేందుకు.. హిందువులకు నరకం చూపించాడు.

ఔరంగజేబు.. క్రూరుడు, మూర్ఖుడు. దండయాత్రలు, యుద్ధాలు మాత్రమే తెలిసిన రాక్షసుడు. ఇస్లాం మతాన్ని విస్తరించేందుకు.. హిందువులకు నరకం చూపించాడు. పన్నుల పేరుతో జనాల రక్తం తాగాడు. ఔరంగజేబు దారుణాలు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్. శంభాజీ మహారాజ్ మీద ఔరంగజేబు క్రూరత్వాన్ని సినిమాగా చూసి.. దేశమంతా రగిలిపోతోంది. మూవీలో చూపించింది కొంతే ! వెన్నుపోటు పొడిచి శంభాజీ బంధించి.. 40రోజులు నరకం చూపించారు. బతికుండగానే చర్మం వలిచారు.. కళ్లు పీకేశారు.. చేతులు నరికేశారు.. నాలుక కోసేశారు.. రోజుకో అవయవం చొప్పున తొలగిస్తూ.. నరకం చూపించారు. ఆ తర్వాత దేహాన్ని ముక్కలు చేసి నదుల్లో పడేశారు. నదిలో కొట్టుకొచ్చిన శరీరపు భాగాలను పోగుచేసి.. అప్పటి జనాలు అంతిమ సంస్కారాలు చేశారని అంటారు ! చనిపోయే చివరిక్షణం వరకు.. ఔరంగజేబుకు తలవంచడం కాదు కదా.. శంభాజీ కళ్లల్లో కనీసం బెదురు కనిపించలేదు.అదీ చావా అంటే..
అదీ శంభాజీ మహారాజ్ అంటే ! ఇస్లాం మతం స్వీకరించాలంటే.. శంభాజీతో పాటు ఎందరో మతగురువులను హింసలు పెట్టిన ఔరంగజేబు.. చేయని పాపాలు లేవ్. ఆ పాపాలు తగిలే.. చివరి దశలో నరకం చూశాడు. దేనికోసం అయితే ఇన్ని దారుణాలు చేశాడో.. చివరి దశలో అంతకుమించి దారుణంగా చనిపోయాడు. ఔరంగజేబు చరిత్ర మొత్తం.. రక్తమే ! తండ్రి షాజహాన్‌ను బంధించి, అన్నల కళ్లు పీకి.. రాజు అయ్యాడు. తన తండ్రి, చెల్లికి మధ్య అక్రమసంబంధం అంటగట్టి ప్రచారం చేయించిన పాపాత్ముడు ఔరంగజేబు. ఇన్ని పాపాలు చేశాడు కాబట్టే.. చివరి దశలో ఏ దిక్కు లేకుండా చనిపోయాడు. చరిత్రలో ఏ చక్రవర్తిని చూసినా చెడుతో పాటు అంతో ఇంతో మంచి పేరు ఉంటుంది. ఔరంగజేబు మాత్రం పాపాత్ముడిగానే ఈ లోకాన్ని విడిచిపోయాడు. 1707లో 88 వయసులో చనిపోయిన ఔరంగజేబు.. చివరి దశలో అనాధగా మారిపోయాడు.
ఏ రాజ్యం కోసమైతే ఇంత రక్తపాతం సృష్టించాడో.. అతని కళ్ల ముందే అదే రాజ్యం కూలిపోయింది. యుద్ధాలపై ఉన్న మోజు.. ఆ సామ్రాజ్యాన్ని దివాళా తీసేలా చేసింది. యుద్ధాలు చేసీ చేసీ మొగల్ సైన్యం అలసిపోవడంతో.. 86 ఏళ్ల వయసులో స్వయంగా ఔరంగజేబు యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. ఓ చిన్న కోటపై యుద్ధం చేసేందుకు.. ఆ వయసులో సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్లాడు ఔరంగజేబు. ఐతే ఆ యుద్ధమే.. ఔరంగజేబుకు చివరిది అయింది. చావు దారిని చూపించింది. 1705లో యుద్ధం చేసి తిరిగి వస్తుండగా.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఔరంగజేబు. అప్పుడు అతన్ని చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు. దీంతో చావలేక.. బతకలేక.. అనారోగ్యంతో నరకం చూశాడు ఔరంగజేబు. ఆ టైమ్‌లోనే చేసిన పాపాలు.. ఔరంగజేబు మనసును తొలచడం స్టార్ట్ అయింది. చివరి రోజుల్లో తన కొడుకులకు రాసిన లేఖ.. చేసిన పాపాలకు ఔరంగజేబు ఎంత ప్రాయశ్చిత్తపడ్డాడో చెప్పకనే చెప్తాయ్.
ఒంటరిగా వచ్చాను, అపరిచితుడిగా వెళ్తున్నాను. నేను ఎవరో నాకు తెలియదు.. నేను ఏం చేస్తున్నానో తెలియదు.. నేను అధికారంలో గడిపిన సమయం దుఃఖాన్నే మిగిల్చింది. చాలా విలువైన జీవితాన్ని వృధా చేశాను.. జీవితం క్షణికమైంది. గతం పోయింది.. భవిష్యత్ కోసం ఆశ లేదు. నా శిక్షకు నేను భయపడుతున్నాను. నేను చేసిన పనులకు నేనే భయపడుతున్నానంటూ.. ఘోరమైన పాపాలు చేశాడు.. ఏ శిక్షపడుతుందో తెలియదు అంటూ చనిపోవడానికి ముందు.. కొడుకులకు ఔరంగజేబు చివరిగా లేఖ రాశాడు. ఇక పాప పరిహారాల కోసం.. తాను చనిపోయిన తర్వాత దేహాన్ని ముక్కలు చేసి.. ఒక్కో ముక్కను ఒక్కో మహా పురుషుడి సమాధి దగ్గర ఉంచాలని.. అలా అయినా మనశ్శాంతి లభిస్తుందని వీలునామాలో రాసి ఔరంగజేబు చనిపోయాడని అంటారు. ఔరంగజేబు అహ్మదాబాద్‌లో చనిపోతే.. ఔరంగబాద్‌లో సమాధి ఉంటుంది. కేవలం మట్టితో కప్పి ఉంటుంది. దాని మీద సబ్జా మొక్క మాత్రమే ఉంటుంది. ఏ జన్మలో చేసిన పాపాలు.. అదే జన్మలో వెంటాడుతాయ్. ఔరంగజేబు జీవితమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్.