ఫైనల్లీ షిప్ సీజ్ అయింది…!

కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ను సీజ్ చేసారు అధికారులు. ఈ విషయాన్ని స్వయంగా కాకినాడ కలెక్టర్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత కదిలిన అధికార యంత్రాంగం.. షిప్ పై చర్యలు తీసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2024 | 02:51 PMLast Updated on: Dec 03, 2024 | 2:51 PM

Authorities Have Seized The Stella Ship At Kakinada Port

కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ను సీజ్ చేసారు అధికారులు. ఈ విషయాన్ని స్వయంగా కాకినాడ కలెక్టర్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత కదిలిన అధికార యంత్రాంగం.. షిప్ పై చర్యలు తీసుకుంది. ఇక ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసారు.

రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్‌, కస్టమ్స్‌ అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసారు. రేషన్‌ బియ్యం విషయంలో అధికారుల వైఫల్యం ఉందన్నారు. షిప్ సీజ్ చేశామని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నాం.. గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తాం అని స్పష్టం చేసారు.