పోసానికి బెయిల్…!
చంద్రబాబు పవన్ కళ్యాణ్‌పై అనుచి వ్యాఖ్యల కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరయ్యింది. ఈ వ్యవహారంలో పోసాని మీద మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.

చంద్రబాబు పవన్ కళ్యాణ్‌పై అనుచి వ్యాఖ్యల కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరయ్యింది. ఈ వ్యవహారంలో పోసాని మీద మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. మొదట నాలుగు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుల్లో వరుసగా పోసానికి బెయిల్ వచ్చింది.
దీంతో ఆయన రిలీజ్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆ నాలుగు కేసుల్లో బెయిల్ రాగానే పోసాని మీద మరో ఫిర్యాదు అందింది. దీంతో సీఐడీ ఆయనను అదుపులోకి తీసుకుంది. దీంతో బెయిల్ వచ్చినా జైలులోనే ఉన్నారు పోసాని. ఇప్పుడు ఆ కేసులో కూడా బెయిల్ రావడంతో త్వరలోనే ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.