సజ్జల భార్గవ్ కు బెయిల్ పిటీషన్ వాయిదా…!
వైసీపీ సోషల్ మీడియా వింగ్ నేత సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ నెల 29కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సజ్జల భార్గవ్ రెడ్డి తరఫున వాదనలు పూర్తి కాగా... అన్ని కేసుల్లో బెయిల్ పిటీషన్లను ఎల్లుండికి వాయిదా వేసింది కోర్ట్.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ నేత సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ నెల 29కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సజ్జల భార్గవ్ రెడ్డి తరఫున వాదనలు పూర్తి కాగా… అన్ని కేసుల్లో బెయిల్ పిటీషన్లను ఎల్లుండికి వాయిదా వేసింది కోర్ట్. ఏపీలో పోలీసులు రూలింగ్ పార్టీ ఒత్తిడికి ప్రభావితం అవుతున్నారని కోర్టుకు పిటీషనర్ తెలిపాడు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కులను కూడా కాలరాసి అక్రమ కేసులు పెట్టారని కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు.
కేసుల నమోదులో ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్న ప్రభుత్వం… ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేసిన అసభ్య పోస్టులు పెట్టిన వారు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. ఇలాంటి అన్ని కేసుల పిటిషన్లు ఈ నెల 29 విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఇక తాను విదేశాల్లో ఉన్నా అని సజ్జల భార్గవ్ రెడ్డి చెప్పడం గమనార్హం.