షాకింగ్: ఏపీ కేబినేట్ లో బాలయ్య…? మరో పేరు కూడా…?
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అడుగు పెట్టనున్నారా...? ఖాళీ ఉన్న మంత్రి పదవి విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది...? ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి... బాబు ముందు ఉంచిన ప్రతిపాదన ఏంటీ...?
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అడుగు పెట్టనున్నారా…? ఖాళీ ఉన్న మంత్రి పదవి విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది…? ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి… బాబు ముందు ఉంచిన ప్రతిపాదన ఏంటీ…? దీనిపై ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. చంద్రబాబు ఆ ఒక్క మంత్రి పదవి విషయంలో దాదాపు పది పేర్లు పరిశీలించారు. అసలు ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటీ అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
తాజాగా కొన్ని పేర్లు మళ్ళీ బయటకు వచ్చాయి. ఏపీ శాసన మండలిలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల స్థానం ఒకటి కాగా ఉభయ గోదావరి జిల్లాల స్థానం ఒకటి. దీనిపై చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెద్ద కసరత్తు చేసి చివరికి ఆలపాటి రాజాను, కెఎస్ జవహార్ ను దాదాపుగా ఎంపిక చేసారు. వీరు ఇద్దరిలో డెల్టా టైగర్ గా పేరున్న ఆలపాటి రాజాను ఏపీ కేబినేట్ లోకి చంద్రబాబు నాయుడు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదే మంత్రి పదవి కోసం దేవినేని ఉమా కూడా ఎదురు చూస్తున్నారనే టాక్ ఉంది.
ఇక విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరుని కూడా గట్టిగానే పరిశీలిస్తోంది ఏపీ సర్కార్. సుజనా చౌదరికి కేంద్ర మంత్రి వర్గంలో పని చేసిన అనుభవంతో పాటుగా కేంద్ర పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఒకవేళ బిజెపికి ఆ మంత్రి పదవి కేటాయిస్తే కచ్చితంగా సుజనా చౌదరికి బాబు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇక అనూహ్యంగా బిజెపి నుంచి మరో పేరు పరిశీలనలోకి వచ్చింది. గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సిఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే ముందు కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. దీనితో ఆ మంత్రి పదవికి ఆయన పేరు ఖరారు చేయవచ్చు అనే వార్తలు కూడా వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవంతో పాటుగా… మంచి వాగ్దాటి కూడా ఉంది. అలాగే ఢిల్లీ స్థాయిలో కూడా కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరుంది. దీనితో కిరణ్ కుమార్ రెడ్డి పేరుని పరిశీలిస్తున్నారని, ఈ విషయంలో చంద్రబాబు సానుకూలంగా కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో పేరు పరిశీలనలోకి వచ్చింది.
ఆ పేరే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బాలయ్య ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా కేబినేట్ లోకి మాత్రం అడుగు పెట్టలేదు. ఇక ఆయనకు కూడా మంత్రి కావాలనే కోరిక ఉందని అందుకే బాలయ్య పేరుని చంద్రబాబు పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బాలయ్య ఇటీవల చంద్రబాబుని కలిసిన సందర్భంగా తన మనసులో మాట బయట పెట్టారని కూడా టాక్ ఉంది. కాని అది ఎంత వరకు నిజం అనేది చెప్పలేం. కారణం బాలయ్య… ఒకవైపు సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.
ఆయన చేతిలో మూడు సినిమాలతో పాటుగా ఆహాలో ఒక షో ఉంది. ఇవన్నీ ఆయన బ్యాలెన్స్ చేయాలంటే కాస్త కష్టమే. హిందూపురంలో ఇప్పటికే ఆయన అందుబాటులో ఉండటం లేదనే విమర్శ వచ్చింది. అందుకే బాలయ్య అక్కడ పదే పదే పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు ఆస్పత్రి బాధ్యతలు కూడా బాలయ్యపై ఉన్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ బాలయ్య ఇప్పుడు మంత్రి పదవి బాధ్యతలను కూడా స్వీకరించాలి అంటే కచ్చితంగా అది విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టే. అందుకే బాలయ్య విషయంలో కేవలం రూమర్ మాత్రమే అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఆ ఒక్క మంత్రి పదవి మాత్రం చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా మారింది. అటు గంటా శ్రీనివాసరావు కూడా ఆ మంత్రి కావాలని అడిగినట్టుగా తెలిసింది.