పవన్ తో ఉంటూ వైఎస్ పై బాలినేని అభిమానం…!
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి... వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై సంచలన కామెంట్స్ చేసారు. ఆస్తుల విషయంలో జగన్, షర్మిల బహిరంగ లేఖలతో రోడ్ ఎక్కారని... నేను జనసేనలోకి వచ్చిన నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని ఆయన గుర్తు చేసుకున్నారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి… వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై సంచలన కామెంట్స్ చేసారు. ఆస్తుల విషయంలో జగన్, షర్మిల బహిరంగ లేఖలతో రోడ్ ఎక్కారని… నేను జనసేనలోకి వచ్చిన నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని ఆయన గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి హుందాగా రాజకీయాలు చేశారన్నారు. మేము ఆర్థికంగా బలపడ్డాము అంటే కారణం విజయమ్మ అని తెలిపారు. చంద్రబాబు, కూటమి చేస్తుంది అనడం కరెక్ట్ కాదు..మాకు ఏం అవసరం అని నిలదీశారు.
కుటుంబ తగదాని కూటమి కి అంటగడుతున్నారన్నారు. విజయమ్మ ఈ గొడవలకి పుల్ స్టాప్ పెట్టాలి అని కోరారు. విజయమ్మ నే జడ్జిమెంట్ ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఆస్తుల కోసం రోడ్ ఎక్కడం బాధగా ఉందన్నారు. ఆడబిడ్డ కంట తడి పెట్టడం మంచిది కాదని జగన్ ను హెచ్చరించారు. వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి పెద్ద మనషులుగా సర్దుబాటు చేయాలని… సమస్యను జటిలం చేసి వైఎస్ కుటుంబం పరువును బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. షర్మిల, జగన్ ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు.
నేను వైసీపీ లో ఆస్తులు సంపాదించుకొని జనసేన లోకి వెళ్లాను అని ప్రచారం చేస్తున్నారని నేను వైసీపీ లో ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప సంపాదించుకోలేదు.. ఇది జగన్ కి కూడా తెలుసన్నారు. నేను ఆస్తులు అమ్ముకున్నానని తెలిపిన ఆయన నన్ను ఎలక్షన్ ముందే జనసేనలోకి తీసుకోవాలని అనుకున్న అని పవన్ కళ్యాణ్ అన్నారని నేను మరల వెనక్కి వెళ్ళిపోతున్నాను అని సోసల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కోసం నా మంత్రి పదవి వదులుకున్నా అని తెలిపారు.