రేపు మీ బండారం బయటపెడతా… బాంబు పేల్చిన బాలినేని

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దమైన బాలినేని... రాజీనామా సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసిపి లో ఒక కోటరీ గతంలో నడిచింది ఇప్పుడూ కూడా నడుస్తుందన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2024 | 07:58 PMLast Updated on: Sep 18, 2024 | 7:58 PM

Balineni Sensational Comments

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దమైన బాలినేని… రాజీనామా సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసిపి లో ఒక కోటరీ గతంలో నడిచింది ఇప్పుడూ కూడా నడుస్తుందన్నారు. నేను ఆ పార్టీ లో ఉండొద్దు అని వైసిపి నాయకులే కోరుకున్నారని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఒంగోలు ఎంపి సీట్ వ్యవహారం లో నేను చెప్పిన మాగుంట కు టికెట్ ఇవ్వకుండా చెవిరెడ్డి కి ఇచ్చారని మండిపడ్డారు. ఆ సీటు తనకు కూడా రాకుండా అడ్డుకున్నారన్నారు.

నా పై సొంత పార్టీ నాయకులే అసత్య ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను గత కొద్ది రోజుల నుంచి నేను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఆ నిర్ణయాలకు కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటున్నానని ఈరోజు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. వైసీపీలో అవమానం జరగడంతోనే పార్టీకి ఈరోజు రాజీనామా చేశానని స్పష్టం చేసారు. ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయని కొన్ని విషయాలు చెప్పాను వాటిని నెగిటివ్ గా తీసుకున్నారని అసహనం వ్యక్తం చేసారు.

పార్టీలో నాకు జరిగిన అవమానాలు అన్ని విషయాలు రేపు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తాను అంటూ బాంబు పేల్చారు. రేపు మీడియా సమావేశంలో బాలినేని ఏం మాట్లాడతారో అనే ఆందోళన వైసీపీ నేతల్లో నెలకొంది. బాలినేని… జగన్ లక్ష్యంగా ఈవీఏంలపై కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఏమైనా మాట్లాడతారా అనే దానిపై ఆందోళన నెలకొంది. ఇక ఒంగోలులో మాజీ మంత్రి బాలినేనికి మద్దతుగా బాణాసంచా కాల్సిన జనసేన కార్యకర్తలు…రేపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో బాలినేని భేటి కానుండటంతో సంబరాలు చేసుకున్నారు.

జనసేన బలోపేతం కోసం పార్టీలోకి వస్తున్న బాలినేనికి స్వాగతం పలుకుతున్నామంటున్నారు. ఇక బాలినేని రాకతో ప్రకాశం జిల్లాలో వైసీపీ దాదాపుగా ఇబ్బంది పడినట్టే. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీకి బాలినేని పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇక వైవీ సుబ్బారెడ్డి ఉన్నా కూడా ఆయనకు ప్రజల్లో అంతగా ఆదరణ లేదనే మాట వినపడుతోంది. బాలినేని రాజీనామా చేయకుండా ఉండేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదు.