నువ్వే చెప్పు కేటిఆర్ కు బండి స్ట్రాంగ్ రిప్లై
కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బండి సంజయ్ కు కేటిఆర్ లీగల్ నోటీసులు పంపగా… కేటీఆర్ లీగల్ నోటీస్ కు రిప్లై ఇచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్… కీలక వ్యాఖ్యలు చేసారు. లీగల్ నోటీస్ ద్వారానే కేంద్రమంత్రి బండి తన రిప్లై ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎక్కడా తప్పులేదన్నారు.
పొలిటికల్ విమర్శలకు లీగల్ నోటీస్ ఇవ్వడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. లీగల్ నోటీస్ అంటూ బెదిరింపులకు భయపడేది లేదన్న సంజయ్… లీగల్ నోటీస్ వెనక్కి తీసుకోవాలని, తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా బండి సంజయ్ డిమాండ్ చేసారు.