BANDI SANJAY: నాకు ఏ పదవీ వద్దు.. బీజేపీపై బండి సంజయ్ నెగటివ్ కామెంట్స్..
బీజేపీ మీద ఈగ కూడా వాలనివ్వను అన్నట్టు మాట్లాడే బండి సంజయ్.. మొదటిసారి పార్టీ గురించి నెగటివ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ మళ్లీ బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తానంటే తాను తీసుకోనంటూ చెప్పారు. బండి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
BANDI SANJAY: బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (BANDI SANJAY) పేరు చెప్తేనే అందరికీ గుర్తొచ్చేది హిందుత్వ వాదం. కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ఆయన. ప్రాణం పోయినా బీజేపీలోనే ఉంటా తప్ప సెక్యులర్ పార్టీల జోలికి వెళ్లను అనే మనస్థత్వం ఆయనది. ఇదే విషయాన్ని స్వయంగా చాలా సార్లు చెప్పారు కూడా. బీజేపీ మీద ఈగ కూడా వాలనివ్వను అన్నట్టు మాట్లాడే బండి సంజయ్.. మొదటిసారి పార్టీ గురించి నెగటివ్ కామెంట్స్ చేశారు.
KTR: అలా అనడం తప్పే..! చంద్రబాబు అరెస్టు తర్వాతి వ్యాఖ్యలపై కేటీఆర్..
ఒకవేళ మళ్లీ బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తానంటే తాను తీసుకోనంటూ చెప్పారు. బండి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ బీజేపీకి బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక పార్టీలో మంచి ఊపు వచ్చింది. వరుసగా ఎన్నికల్లో కూడా గెలుస్తూ వచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అనే స్థాయికి వచ్చింది. దీంతో పార్టీ అధ్యక్షుడిగా బండి టర్మ్ పెంచుతారని అంతా అనుకున్నారు. పార్టీ హైకమాండ్ కూడా సంజయ్ పదవీకాలాన్ని పెంచుతామనే చెప్పిందట. కానీ ఆఖరి నిమిషంలో సంజయ్ అధ్యక్ష పదవిని తొలగించి కిషన్ రెడ్డికి ఆ పదవిని ఇచ్చింది బీజేపీ హైకమాండ్. సంజయ్‌కి జాతీయ స్థాయిలో పదవినిచ్చింది. కానీ పోరాటం రాష్ట్రంలో ఉంటే తాను కేంద్రంలో ఏం చేస్తానని బండి ఫీలయ్యారట.
ఇదే విషయాన్ని హైకమాండ్‌కు కూడా చెప్పారట. తన పదవి తీసేస్తారని కలలో కూడా అనుకోలేదంటూ చెప్పారట బండి. తన సారథ్యంలో బీజేపీ ఎన్నికల్లోకి వెళ్తుందని.. ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నానని చెప్పారు సంజయ్. ఇంత జరిగిన తరువాత మళ్లీ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే ఎలా తీసుకోవాలి అంటూ ప్రశ్నించారు సంజయ్. ఒకవేళ పార్టీ నుంచి ఆఫర్ వస్తే ఖచ్చితంగా తాను రిజెక్ట్ చేస్తానని చెప్పారు. పార్టీకి ముందు నుంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా ఉన్న సంజయ్ నోటి నుంచి ఇలాంటి నెగటివ్ మాటలు రావడం ఇప్పుడు బీజేపీలోనే కాదు.. పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది.