గద్దర్ పై బండి సంచలన కామెంట్స్
ప్రజా యుద్ద నౌక.. గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని మండిపడ్డారు
ప్రజా యుద్ద నౌక.. గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని మండిపడ్డారు. గద్దర్ నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తని ఆరోపించారు. నక్సల్స్ అనేక మంది మా కార్యకర్తలను చంపారని గద్దర్ కు ఎందుకు ఇస్తాం ? అని నిలదీశారు. అసలు ఇవ్వం అని స్పష్టం చేసారు. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన దాంట్లో గద్దర్ ఉన్నారన్నారు.
మాకు భేషజాలు లేవని స్పష్టం చేసారు. మేము రాష్ట్ర అభివృద్ధికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రం రాష్ట్రం కలిస్తేనే తెలంగాణ అభివ్రుది జరుగుతుందని కేంద్రం ఏది చేసిన ఆలోచన చేసే ఇస్తుందని స్పష్టం చేసారు. కేసీఆర్ హయాంలో రెండు లక్షల ఇళ్లు ఇస్తే ఎవరికి ఇవ్వలేదన్నారు. అవి ఎవరికి ఇవ్వకపోవడంతో ఆ ఇల్లు కూలిపోయే పరిస్తితి ఉందన్నారు.