గద్దర్‌కు ఎందుకివ్వలేదు.. బాలయ్యకు ఎందుకిచ్చారు.. పద్మాలకు రాజకీయ మరకలు!
అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కవితకు అనర్హం కానట్లు.. అవార్డు, రివార్డు రాజకీయానికి కాదు అనర్హం అనిపిస్తోంది పరిణామాలు చూస్తుంటే ! ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్లు సాగిన తెలంగాణ రాజకీయం.. మూడేళ్లుగా మలుపుల మీద మలుపులు తిరుగుతోంది.
అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కవితకు అనర్హం కానట్లు.. అవార్డు, రివార్డు రాజకీయానికి కాదు అనర్హం అనిపిస్తోంది పరిణామాలు చూస్తుంటే ! ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్లు సాగిన తెలంగాణ రాజకీయం.. మూడేళ్లుగా మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ప్రతీ విషయానికి, ప్రతీ వివాదానికి.. రాజకీయం అంటోంది.. రాజకీయ రచ్చకు దారి తీస్తోంది. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. పద్మ అవార్డుల విషయంలోనూ అదే కనిపిస్తోంది కాబట్టి ! సిఫారసు చేసిన వాళ్లకు పద్మ అవార్డులు ఇవ్వలేదని.. కేంద్రం అన్యాయం చేసిందని.. తాము ఇక యుద్ధం చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు.. ఇలా ప్రముఖులకు పద్మశ్రీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపినా.. కేంద్రం లెక్క చేయలేదని.. ఇది తెలంగాణ జనాలను అవమానించడమే అన్నది రేవంత్ రెడ్డి విమర్శ.
రేవంత్ రెడ్డి మాటలపై కేంద్రమంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. మంచి పేరు పంపింతే కేంద్రం పరిసీలిస్తుందని.. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే.. పద్మ అవార్డులు ఇవ్వరంటూ బండి ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగారా అంటే.. గద్దర్‌కి పద్మ అవార్డు ఎలా ఇస్తాం.. ఆయన భావజాలం ఏంటి.. బరాబర్ గద్దర్‌కు ఇవ్వం అంటూ నిప్పు రాజేశారు. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను రగిలిస్తోంది.
బండి సంజయ్ వ్యాఖ్యలతో.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ యుద్ధం పీక్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వార్ ఏ మలుపు తిరుగుతుంది.. చివరికి ఏం జరుగుతుందన్నది పక్కనపెడితే.. పద్మ అవార్డులపై ఇప్పుడు జనాల్లోనూ కొత్త చర్చ మొదలైంది. గద్దర్‌కు ఎందుకు ఇవ్వలేదు.. బండి సంజయ్ ఎందుకు అలా అన్నారన్నదిపక్కనపెడితే.. పద్మపురస్కారాల లిస్ట్‌పై ఇప్పుడు సామాన్యుల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయ్. రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని అవార్డులు ఇవ్వడం ఏంటి.. పద్మాలకు రాజకీయ మరకలు అంటిస్తారా.. ఇదేం పద్దతి అంటూ ఎగ్జాంపుల్స్ చెప్పి మరీ నిలదీస్తున్నారు జనాలు. ఏఐజీ ఆసుపత్రి ఓనర్ డాక్టర్ నాగేశ్వరరావుకు వైద్యరంగంలో పద్మవిభూషణ్ ఇచ్చారు. ఆసుపత్రి పేరుతో వ్యాపారం చేసే ఆయనకు అవార్డులు ఇవ్వడం అంటే.. దాని వెనక ఉంది అవసరమే కదా అనే విమర్శలు వినిపిస్తున్నాయ్.
ఇక హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ ఎందుకిచ్చారో చెప్పాలని కొందరు నిలదీస్తుంటే.. ప్రజా వ్యవహారాల రంగంలో.. మంద కృష్ణకు పద్మశ్రీ ఏంటన్నది మరికొందరి ప్రశ్న. షెడ్యూల్డ్ కులాల్లోని మాదిగలకు మాత్రమే మద్దతుగా నిలిచే మంద కృష్ణకు అవార్డు వెనక ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఇలా తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మొదలైన యుద్ధం.. ఓవరాల్ అవార్డుల మీద వివాదాలకు కారణం అవుతోంది. ఐతే ఒకటి మాత్రం క్లియర్. పద్మ అవార్డులు సిఫారసుల ద్వారా ఇవ్వరు. సిఫారసు చేసిన వారికే ఇవ్వాలని లేదు. పద్మ అవార్డు ఎంపిక ప్రక్రియ పూర్తిగా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. ఫలానా వారికి ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేశాయని ఆ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలన్న రూలేం లేదు. అలాగే తీసుకోకూడదన్న రూల్ లేదు. తాము అవార్డులు ఇవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాయి.