BANDLA GANESH: బీఆర్ఎస్‌పై మాటల దాడి.. ఇదంతా పదవి కోసమేనా బండ్లన్నా..
నెలరోజుల పాలనపై రేవంత్ మీద బండ్ల గుప్పించిన ప్రశంసలు వింటే మనోడి మసాజ్ మాములుగా లేదుగా.. పిసుకుడే పిసుకుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఎమ్మెల్సీ కోసం రేవంత్‌తో సహా పార్టీ సీనియర్లను దగ్గర చేసుకునేందుకు బండ్ల మోగిస్తున్న మోత అంతా ఇంతా కాదు.
BANDLA GANESH: బండ్ల గణేష్.. ఆయన మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఆ పదాలకు హద్దు ఉండదు. ఆ మాటలకు సోషల్ మీడియాలో తిరుగుండదు. బండ్ల మాట్లాడుతున్నారంటే.. మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయి చూసేవాళ్లు ఎందరో ! ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో తలదూరుస్తూ నిత్యం ఏదో ఒక వివాదంలో ట్రెండ్ అవుతుంటాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని ప్రకటన చేసి.. ఆ తర్వాత అంతా ఉత్తిదే అని కొట్టిపారేసి ట్రోలర్లకు ఆహారంగా మారిపోయాడు.
GUDIVADA AMARNATH: అమర్నాథ్‌కు టిక్కెట్ ఖాయం! పెందుర్తిలో టీడీపీ, జనసేనకు చెక్
సరే సరే లే.. ఎన్నో అనుకుంటాం.. అంటాం.. అన్నీ అవుతాయా ఏంటి అంటూ.. ఓ సినిమా డైలాగ్ వదిలేశారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ మీద.. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొని ఆవేశంతో ఊగిపోతూ మనోడు మాట్లాడిన మాటలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత చాలాకాలం సైలెంట్‌గా ఉన్న బండ్ల.. తాను ఏ పార్టీలో లేనని ప్రకటించారు. ఆ తర్వాత అప్పుడప్పుడు బీఆర్‌ఎస్‌ను ఆకాశికెత్తుతూ మాట్లాడేవారు. పాలమూరును పచ్చగా చేసిన ఘనత కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు దక్కుతుందంటూ వదిలిన పొగడ్తలు అన్నీ ఇన్నీ కావు ఆమధ్య! బీఆర్‌ఎస్ హయాంలో.. హైదరాబాద్ న్యూయార్క్‌లా మారిందని పింక్ పార్టీ మీద ప్రశంసలు గుప్పించారు చాలసార్లు. కట్ చేస్తే ఎన్నికలు దగ్గరవుతున్నా కొద్దీ.. మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు బండ్ల. బీఆర్ఎస్ మీద రివర్స్ అయ్యారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని తాను ఏడో తేదీ నుంచే ఎల్బీస్టేడియంలో పడుకుంటానని చెప్తూ.. ఎన్నికల ముందు బండ్ల మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయ్. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బండ్ల మరింత రెచ్చిపోతున్నాడు. రేవంత్‌కు, కాంగ్రెస్ పెద్దలకు దగ్గరయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.
నెలరోజుల పాలనపై రేవంత్ మీద బండ్ల గుప్పించిన ప్రశంసలు వింటే మనోడి మసాజ్ మాములుగా లేదుగా.. పిసుకుడే పిసుకుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఎమ్మెల్సీ కోసం రేవంత్‌తో సహా పార్టీ సీనియర్లను దగ్గర చేసుకునేందుకు బండ్ల మోగిస్తున్న మోత అంతా ఇంతా కాదు. ఏ బీఆర్ఎస్ మీద ప్రశంసలు గుప్పించారో.. హైదరాబాద్ విషయంలో కేటీఆర్‌ను పొగిడిన పొగడ్త.. పొగడకుండా పొగిడాడో.. ఇప్పుడు ఆ కేసీఆర్, కేటీఆర్‌నే డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. ఈ పిసుకుడు అంతా.. ఎమ్మెల్సీ కోసమే అని తెలుసులే అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయ్. మరి బండ్ల ఆవేశాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుందా.. ఆయన ఆశ నెరవేరుస్తుందా లేదో చూడాలి.