BARRELAKKA: బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించబోతున్న బర్రెలక్క.. అసలు విషయం ఇదీ..!

బడా బడా నేతల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది బర్రెలక్క ప్రచారం జరుగుతోంది. ఒక్కటి మాత్రం క్లియర్‌.. బర్రెలక్కు సోషల్‌ మీడియాలో వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరికి.. ఇప్పుడు బర్రెలక్క తెలిసిపోయింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2023 | 07:03 PMLast Updated on: Nov 24, 2023 | 7:03 PM

Barrelakka Contendership Help To Win Brs Candidate In Kollapur Here Is The Analasys

BARRELAKKA: బర్రెలక్క పేరు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో హోరెత్తిపోతోంది. ఖండాంతరాల నుంచి బర్రెలక్కకు సపోర్ట్ లభిస్తోంది. ఓ సామాన్యురాలి కోసం.. ఇంకో సామాన్యుడు అంటూ.. ఎవరికి వారు.. తమకు తోచినట్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఆర్థికంగానూ అండగా అంటున్నారు. కొల్లాపూర్‌లో నామినేషన్ వేసినప్పుడు.. బర్రెలక్క మీద ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవ్. ఎప్పుడైతే ఆమె ప్రచారం మీద దాడి జరిగిందో.. ఆమె కోర్టుకెక్కిందో.. అప్పుడే అసలైన గేమ్ స్టార్ట్ అయింది. బడా బడా నేతల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది బర్రెలక్క ప్రచారం జరుగుతోంది.

REVANTH REDDY: నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మాది: రేవంత్ రెడ్డి

ఒక్కటి మాత్రం క్లియర్‌.. బర్రెలక్కు సోషల్‌ మీడియాలో వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరికి.. ఇప్పుడు బర్రెలక్క తెలిసిపోయింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కొల్లాపూర్‌ నుంచే కాదు.. ఆమెకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి సపోర్ట్ లభిస్తోంది. కొల్లాపూర్‌లో ఓట్లు లేని ఓటర్లు కూడా ఆమెకు మద్దతు పలికారు. నిధులు సమీకరించారు. కొల్లాపూర్‌లో గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన చరిత్ర ఉంది. 1957 నుంచి ఇప్పటి వరకూ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఈసారి కూడా చరిత్ర క్రియేట్ కాబోతుందా.. బర్రెలక్క విజయం సాధించబోతుందా అనే ఆసక్తి కొల్లాపూర్‌లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే కొన్ని మలుపులు కనిపిస్తున్నాయ్. అందులో ఒకటి.. బర్రెలక్కకు కొల్లాపూర్‌ను మించి బయటి నుంచి మద్దతు కనిపిస్తోంది. మరో కీలక విషయం ఏంటంటే.. బర్రెలక్క ఏ కేసీఆర్‌ సర్కార్‌కి వ్యతిరేకంగా పోటీ చేస్తుందో.. అదే బీఆర్ఎస్‌ అభ్యర్థిని ఆమె గెలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీదే కాంగ్రెస్, బీజేపీ ఆశలు పెట్టుకున్నాయ్. ఐతే బర్రెలక్క కారణంగా ఆ ఓటు చీలిపోయే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. ముఖ్యంగా నిరుద్యోగుల గొంతుకను అంటున్న బర్రెలక్క.. ఆ నిరుద్యోగుల ఓట్లే ప్రధానంగా చీల్చే అవకాశాలు ఉంటాయ్. దీంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఇబ్బంది ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే.. బీఆర్ఎస్ అభ్యర్థి విజయంలో బర్రెలక్కదే ప్రధాన పాత్ర అవుతుంది. క్లియర్‌గా చెప్పాలంటే.. తాను పోటీ చేయడం ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థిని బర్రెలక్క గెలిపించుకోబోతోంది అన్నమాట.