Barrelakka: బడా లీడర్లకు బర్రెలక్క టెన్షన్.. ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంత..?
అప్పుడెప్పుడో ఆమె చేసిన వీడియో.. బర్రెలక్క అలియాస్ శిరీషను సోషల్ మీడియా స్టార్‌ను చేసింది. ఆ తర్వాత ఆమెపై కేసు ఫైల్ చేయడం.. ఆమె పోరాటం చేయడంతో రాష్ట్రం అంతా బర్రెలక్క పేరు ఫేమస్ అయింది. కట్ చేస్తే ఎన్నికల వేళ కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి.. బర్రెలక్క ఝలక్ ఇచ్చింది.
Barrelakka: అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించారు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు పక్కాగా సరిపోయే మాట ఇది. ఎవరు గెలుస్తారో, ఎందుకు గెలుస్తారో, ఎలా గెలుస్తారో అంత ఈజీగా అంచనా వేయడానికి ఉండదు. ఎక్కడో జరిగే ఒక పరిణామం.. ఇంకెక్కడో జరిగే ఇంకో సంఘటనను ప్రభావితం చేస్తుంటుంది. ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. బర్రెలక్క గురించి ! తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని.. ఇంట్లో అమ్మను అడిగి నాలుగు బర్రెలు కొన్నానని.. అదే మంచిదని.. అప్పుడెప్పుడో ఆమె చేసిన వీడియో.. బర్రెలక్క అలియాస్ శిరీషను సోషల్ మీడియా స్టార్‌ను చేసింది.
REVANTH REDDY: కేసీఆర్ బకాసురుడు.. పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారు మయమైంది: రేవంత్ రెడ్డి
ఆ తర్వాత ఆమెపై కేసు ఫైల్ చేయడం.. ఆమె పోరాటం చేయడంతో రాష్ట్రం అంతా బర్రెలక్క పేరు ఫేమస్ అయింది. కట్ చేస్తే ఎన్నికల వేళ కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి.. బర్రెలక్క ఝలక్ ఇచ్చింది. నిరుద్యోగుల గొంతుకనవుతా అని అంటున్న బర్రెలక్క.. 7 అంశాలతో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. ఈమె పోరాటానికి, ధైర్యానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. యానాంలాంటి ప్రాంతాల నుంచి కూడా స్పందన వస్తోంది. అక్కడి మాజీ మంత్రి ఎన్నికల ఖర్చు కోసం బర్రెలక్కకు లక్ష రూపాయల చెక్ అందించారు. తన మిత్రులు కూడా సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. అలాగే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన జానకీపురం సర్పంచ్ నవ్య కూడా బర్రెలక్కకు మద్దతు తెలిపారు. ఆమె స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై వేధింపుల ఆరోపణలు చేసి, ఒక్కసారి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
BJP DECIDES: తెలంగాణలో గెలుపోటముల్ని నిర్ణయించేది బీజేపీనే..? ఏ పార్టీపై ప్రభావం ఎంత..?
వీరితోపాటు.. వైజాగ్, విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరు.. ఇలా చాలా ప్రాంతాల నుంచి బర్రెలక్కకు మద్దతు వ్యక్తం అవుతోంది. ఇక అటు కొల్లాపూర్‌లో బర్రెలక్క ప్రచారం మీద దాడి జరిగింది. ఆమె తమ్ముడిని కొందరు తీవ్రంగా కొట్టారు. దీంతో బర్రెలక్కపై సోషల్ మీడియాలో మరింత సానుభూతి వ్యక్తం అవుతోంది. దీంతో బడాబడా లీడర్లకే.. బర్రెలక్క కారణంగా టెన్షన్ పట్టుకుందనే చర్చ జోరుగా సాగుతోంది. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున జూపల్లి, బీఆర్ఎస్ నుంచి బీరం హర్షవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్యేపోటీ అనుకుంటే.. ఇప్పుడు బర్రెలక్క ప్రభంజనంతో అక్కడ ఏం జరగబోతుందనే చర్చ సాగుతోంది. ఐతే బర్రెలక్కకు వస్తున్న సపోర్ట్ అంతా.. కొల్లాపూర్ బయటనుంచే అనే టాక్ ఉందనే వాళ్లు కూడా ఉన్నారు. 5వేల ఓట్లకు మించి రావు అని జాతకాలు చెప్పేవాళ్లు ఉన్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఓ యువతిగా బర్రెలక్క వేసిన అడుగు.. ప్రతీ ఒక్కరికి స్ఫూర్తి నింపడం ఖాయం అన్నది మరో వర్గం మాట. నిరుద్యోగుల కోసమే పోటీ చేస్తున్నానని బర్రెలక్క అంటున్నారు.
దీంతో ఆ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశాలు క్లియర్‌గా ఉన్నాయ్. అది కాంగ్రెస్, బీజేపీ మీద ఎఫెక్ట్ పడే చాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. బర్రెలక్ష ఓడినా, గెలిచినా.. ఒక్కటి మాత్రం నిజం. నిరుద్యోగుల సమస్యలు ప్రపంచానికి తెలిసివచ్చాయ్. ఓ సామాన్యురాలు ఎన్నికల బరిలో నిలిస్తే రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయ్.. సమాజం ఎలా తోడుగా ఉంటుందని ప్రూవ్ అయిందనే అభిప్రాయాలు సోషల్ మీడియా సాక్షిగా వ్యక్తం అవుతున్నాయ్.