BARRELAKKA: లోక్‌సభ బరిలో బర్రెలక్క.. ఎక్కడి నుంచి పోటీ అంటే..
కొల్లాపూర్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. ఐదు వేలకు పైగా ఓట్లు సాధించింది. బర్రెలక్క ఓడిపోయినా.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీ సీఎం నోటి నుంచి బర్రెలక్క పేరు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు..
BARRELAKKA: బర్రెలక్క్ అలియాస్ శిరీష.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం. ఓ యూట్యూబ్ వీడియోతో ఎంతో పాప్యులారిటీ సంపాదించుకుని, బర్రెలక్కగా ఫేమస్ అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంది బర్రెలక్క గురించే ! నిరుద్యోగులకు ప్రతినిధిని.. వారి ఆశలకు వారధిని అంటూ.. ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క ఎలక్షన్‌లో ఓడిపోయినా.. కోట్లమంది మనసు గెలుచుకుంది.
TELANGANA CONGRESS: తెలంగాణలో సలహాదారుల నియామకం.. నలుగురికి ఛాన్స్.. ఎవరంటే
చాలా మంది విరాళాలు ఇచ్చి.. తమ సమయం కేటాయించి మరీ.. యువకులు బర్రెలక్క కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొల్లాపూర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. ఐదు వేలకు పైగా ఓట్లు సాధించింది. బర్రెలక్క ఓడిపోయినా.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీ సీఎం నోటి నుంచి బర్రెలక్క పేరు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఆమె పేరు మారిమోగిపోయిందా అని ! అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయ్. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయ్. మరి ఇప్పుడు బర్రెలక్క ఏం చేస్తోంది.. ఏం చేయబోతోందనే ఆసక్తి జనాల్లోకనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. తగ్గేదే లే అంటోంది బర్రెలక్క. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధం అవుతోంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటోంది బర్రెలక్క.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాక, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం వచ్చిందని.. ఆ ధైర్యంతోనే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ ముందుకు వెళ్తానని అంటోంది. అసెంబ్లీ ఎన్నికలు తనను మరింత దృఢంగా మార్చాయని.. ఓటుకు నోటు అనే విధానాన్ని రూపు మాపడంపై కృషి చేస్తానని.. జనాల్లో చైతన్యం తీసుకువస్తానని బర్రెలక్క అంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ఊపు ఊపిన బర్రెలక్క.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ఎలా అడుగులు వేయబోతోంది. అప్పుడు అండగా ఉన్న యువత.. ఇప్పుడు కూడా మద్దతుగా నిలుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.