ఈనెల 26న ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయింది. నేటి నుంచి రైతు భరోసా కి వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించి.. వారికి మాత్రమె రైతు భరోసా అందిస్తారు. నేటి నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పర్యటించి సాగుకు అనుకూలమైన భూముల గుర్తిస్తారు. కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు నాలా కన్వర్షన్ అయిన భూములను గుర్తించి రికార్డ్స్ నుంచి తొలగించనున్నారు. సంబంధిత భూముల వివరాలను ఇప్పటికే రెవిన్యూ డిపార్ట్మెంట్ నుంచి వ్యవసాయ శాఖకు బదిలాయింపులు చేస్తారు. 21 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ఏర్పాటు చేసి ఫైనల్ లిస్ట్ కు గ్రామ సభలో ఆమోదం తెలపనున్నారు. గ్రామ సభల్లో ఆమోదించిన లిస్ట్ గ్రామాల్లో ఫ్లెక్సీలు, నోటీస్ బోర్డు లో ప్రదర్శన ఉంటుంది. 25న తుది జాబితాను జిల్లా కలెక్టర్లు కన్ఫామ్ చేసి ఇన్చార్జి మంత్రులచే ఆమోదం పొందిన తర్వాత ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయి. ఇంచార్జ్ మంత్రులు ఆమోదించిన జాబితా ఆధారంగా ఈనెల 26 నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. [embed]https://www.youtube.com/watch?v=cVb1IB2lzO0&t=2s[/embed]