బ్రేకింగ్: అక్క పెళ్లి డబ్బుతో బెట్టింగ్,పట్టాలపై శవం
బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకుని మేడ్చల్‌లో చనిపోయిన సోమేష్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు పాల్పడ్డ సోమేష్.. తన అక్క పెళ్లికి దాచిన డబ్బుతో బెట్టింగ్ ఆడినట్టు పోలీసులు చెప్తున్నారు.

బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకుని మేడ్చల్‌లో చనిపోయిన సోమేష్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు పాల్పడ్డ సోమేష్.. తన అక్క పెళ్లికి దాచిన డబ్బుతో బెట్టింగ్ ఆడినట్టు పోలీసులు చెప్తున్నారు. ఆ డబ్బు బెట్టింగ్‌లో పోవడం.. అక్క పెళ్లి అవుతుందో లేదోననే మనో వేదనతోనే సోమేష్ చనిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. చనిపోయే ముందు చివరిసారిగా సోమేష్ తన స్నేహితులకు ఫోన్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు.
దానికి సంబంధించిన ఆడియో కాల్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బెట్టింగ్‌లో తాను డబ్బు పోగొట్టుకోవడంతో తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నట్టు కాల్‌లో తన స్నేహితుడికి చెప్పాడు సోమేష్. ఆత్మహత్య చేసుకోవొద్దని ఎంత వారించినా రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక పెళ్లి డబ్బులు బెట్టింగ్‌లో పోవడం.. మరో పక్క కొడుకు ఆత్మహత్యతో సోమేష్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.