రాజీవ్ విగ్రహం పీకి పడేస్తా: కేటిఆర్ సంచలనం
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సంచలన ఆరోపణలు చేసారు. అంబేద్కర్ వారసత్వాన్ని లెగసీని సమాజానికి తెలవద్దని దురుద్దేశంతోనే అంబేద్కర్ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఆయన వర్ధంతి నిర్వహించడం లేదని మండిపడ్డారు.
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సంచలన ఆరోపణలు చేసారు. అంబేద్కర్ వారసత్వాన్ని లెగసీని సమాజానికి తెలవద్దని దురుద్దేశంతోనే అంబేద్కర్ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఆయన వర్ధంతి నిర్వహించడం లేదని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పూలమాల వేయాలన్న సోయి కూడా లేదని ఆరోపించారు. దళితులందరికీ సమాజంలోని ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేసారు.
దీని వెనుక ఉన్న లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేసారు. కేవలం కాంగ్రెస్ హై కమాండ్ ఉద్దేశాలతోనే అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేస్తున్నారా..? అని ప్రశ్నించిన కేటీఆర్… ప్రకాష్ అంబేద్కర్ చేత ప్రారంభించబడిన మహా విగ్రహానికి ఎందుకు అవమానం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాళాలు వేసి బంధించి కనీసం శుభ్రపరచకుండా ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పైన అక్కసు ఉంటే దానిని అంబేద్కర్ విగ్రహం పైన ఎందుకు చూపిస్తున్నారని నిలదీశారు.
అంబేద్కర్ కు నివాళులు అర్పించకుండా అడ్డుకుంటుంది. మమ్మల్ని కాదు అంబేద్కర్ వారసులను అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. అంబేద్కర్ కి నివాళులు కూడా అర్పించలేని ఇంగిత సంస్కారం లేని కుసంస్కారి రేవంత్ రెడ్డని మండిపడ్డారు. ప్రపంచం అబ్బురపడిన మహా మేధావి అంబేద్కర్ గారిని స్మరించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. అదే స్ఫూర్తితో దేశానికి ఒక గొప్ప సందేశం ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్న 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పైన ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు.
అంబేద్కర్ ఆలోచన విధానానికి అంబేద్కర్ విగ్రహానికే కాదు దళితుల అభివృద్ధికి సైతం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. దళిత బంధు పెంచి ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిందని దళిత బంధు చెక్కులను రద్దుచేసి వారి జీవితాలను మారకుండా చేస్తున్నదని విమర్శించారు. పేద దళిత గిరిజన బహుజన బిడ్డలను ఉన్నత చదువుల కోసం గత ప్రభుత్వం విదేశాలకు పంపిస్తే… ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఓర్వలేక వారి ఓవర్సీస్ స్కాలర్షిప్పులను నిలిపివేశాడన్నారు. కచ్చితంగా మేము ప్రభుత్వంలోకి రాగానే రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఏర్పాటు చేసిన చోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమరవీరుల స్తూపానికి అంబేద్కర్ సచివాలయానికి మధ్యన ఉండాల్సింది కచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం అని స్పష్టం చేసారు. అందుకే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పంపాల్సిన చోటికి పంపిస్తామన్నారు.