బిగ్ బ్రేకింగ్: ఐఏఎస్ లకు హైకోర్ట్ షాక్
ఐఏఎస్ అధికారులకు తెలంగాణా హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది హైకోర్ట్. ఐఏఎస్ లు దాఖలు చేసిన పిటీషన్లను డిస్మిస్ చేసింది. వెంటనే అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.
ఐఏఎస్ అధికారులకు తెలంగాణా హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది హైకోర్ట్. ఐఏఎస్ లు దాఖలు చేసిన పిటీషన్లను డిస్మిస్ చేసింది. వెంటనే అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. ప్రజా సేవ కోసమే ఐఏఎస్ లు విధులు నిర్వహించాలని కోర్ట్ స్పష్టం చేసింది. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్ళాలని పేర్కొంది.
ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్ కాదని సూచించింది. డిస్మిస్ చేస్తే మళ్ళీ అప్పీల్ చేస్తారని ఇది లాంగ్ ప్రాసెస్ అని కోర్ట్ స్పష్టం చేసింది. ఓ వైపు కోర్ట్ లో వ్యవహారం ఉండగా… రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేయడానికి 10-15 రోజులు సమయం కావాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని పిటీషనర్ల తరుపు న్యాయవాదులు కోర్ట్ కి తెలిపినా కోర్ట్ వారి అభ్యర్ధనను తోసిపుచ్చింది.