బిగ్ బ్రేకింగ్; లడ్డూలో కొవ్వు వాడింది నిజమే, బయటకు వచ్చిన రిపోర్ట్
తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఈ అంశంపై విచారణ జరపాలని హిందుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.
తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఈ అంశంపై విచారణ జరపాలని హిందుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. విశ్వ హిందూ పరిషత్ తో పాటుగా హిందూ మహా సభ సైతం స్పందించింది. దీనిపై విచారణ జరిపి వాస్తవాలు వెలుగు తీసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇది రాజకీయ దుమారానికి కూడా కారణం అయింది.
వైసీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు ప్రమాణం చేయాలని డిమాండ్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిపామని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి.. అని మండిపడ్డారు. 140 కోట్ల హిందువుల మనోభావాలను ఇవి దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని ఆరోపించారు. హీనమైన చర్యలకు పాల్పడి ఉంటే వారికి తగిన శాస్తి కచ్చితంగా వెంకటేశ్వర స్వామి చేస్తాడు అన్నారు.
అయితే తాజాగా టీటీడీ అధికారికంగా విడుదల చేసిన ఓ నోట్ లో కీలక విషయాలు బయటకు వచ్చాయి. తిరుమల లడ్డులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా జంతువుల కొవ్వు వాడినట్టుగా నిర్ధారణ అయింది. ఆర్గానిక్ నెయ్యితోనే తాము నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేశామని వైసీపీ క్లారిటీ ఇచ్చినా తాజాగా టీటీడీ నుంచి వచ్చిన ఓ రిపోర్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జాతీయ మీడియా సైతం ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. దీనితో వైసీపీపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
గత అయిదేళ్ళుగా వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రిపోర్ట్ లో స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ ఈ విషయాన్ని నిర్ధారించింది. జులై 8, 2024న ప్రసాదం సాంపిల్స్ పంపగా… జులై 17న ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు ఉందని ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ లో స్పష్టంగా అర్ధమైంది.