BRS party : నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు నేతలు..
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో శరత్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బోధన్‌కు చెందిన శరత్ రెడ్డి దంపతులకు లోకల్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ కు మధ్య ఏడాదిలో వెలుగు చూసిన విభేదాల నేపథ్యంలో వారు పార్టీ వీడినట్టు తెలుస్తోంది.
గులాబీకి గుడ్ బై..
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ బీఆర్‌ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి సీనియర్ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు పార్టీని వీడగా ఇప్పుడు నిజామాబాద్‌లో మరో కీలక నేత బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త.. బోధన్ మున్సిపల్ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో శరత్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బోధన్‌కు చెందిన శరత్ రెడ్డి దంపతులకు లోకల్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ కు మధ్య ఏడాదిలో వెలుగు చూసిన విభేదాల నేపథ్యంలో వారు పార్టీ వీడినట్టు తెలుస్తోంది. బోధన్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదంతో పాటు, శరత్ రెడ్డిపై ఎమ్మెల్యే షకీల్‌పై హత్యాయత్నం కేసులు నమోదు కావడంతో వీళ్ల మధ్య గ్యాప్ ఏర్పడింది. శరత్ రెడ్డి స్థానికంగా బలమైన నాయకుడు కావడంతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. శరత్ రెడ్డి అధికార పార్టీని వీడిన నేపథ్యంతో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరినట్టు అయింది. శరత్ రెడ్డి పార్టీ మారడంతో బోధన్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి.
బోధన్ నియోజకవర్గంలో షకీల్ ఆమెర్‌ను ఓడిస్తామని రంజాన్ పండుగ సందర్భంగా మజిలీస్ పార్టీ నాయకులు శపథం చేసిన విషయం తెలిసిందే వారిలో కొందరు శరత్ రెడ్డితో టచ్‌లో ఉండడంతోనే వారు కూడా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తారని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. శరత్ రెడ్డి తో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మజ్లిస్ కౌన్సిలర్లు, అధికార పార్టీ సర్పంచులు, పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిసింది. ఎన్నికలకు సరిగ్గా రెండు నెలలు కూడా సమయం లేదు. ఇలాంటి సందర్భంలో నియోజకవర్గంలో కీలక నేత పార్టీ మారడం నిజామాబాద్‌లో ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీకి గొడ్డలి పెట్టుగా మారింది.