చైనా బలుపు దిగిందా..? అర్ధమైందా జిన్ పింగూ..?

తనదాక వస్తేకానీ నొప్పి తెలీదనే మాట జిన్‌పింగ్‌కు బహుశా ఇప్పుడే అర్ధమవుతుందేమో. ట్రంప్ ఎంట్రీకి ముందు తానే ప్రపంచానికి సుప్రీం అనుకున్నాడు. చైనా డిసైడ్ అయితే ఏదైనా జరిగి తీరాల్సిందే అన్న భ్రమల్లో ఉండేవాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 07:14 PMLast Updated on: Apr 12, 2025 | 7:14 PM

Big Shock To China

తనదాక వస్తేకానీ నొప్పి తెలీదనే మాట జిన్‌పింగ్‌కు బహుశా ఇప్పుడే అర్ధమవుతుందేమో. ట్రంప్ ఎంట్రీకి ముందు తానే ప్రపంచానికి సుప్రీం అనుకున్నాడు. చైనా డిసైడ్ అయితే ఏదైనా జరిగి తీరాల్సిందే అన్న భ్రమల్లో ఉండేవాడు. అమెరికాతో పోటీ పడుతూ చిన్న దేశాలను బెదిరిస్తూ, దారికి రాని వాళ్లను తొక్కుకుంటూ ముందుకుపోయాడు. భూమి, సముద్రం, ఆకాశం ఇలా అన్నిచోట్లా ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డాడు. చైనా నుంచి బాధింపబడని దేశాలను వేళ్లపై లెక్కపెట్టొచ్చు.పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి గుంటనక్కల్లాంటి దేశాలు మినహా ప్రజాస్వామ్య దేశాలు డ్రాగన్ బెదిరింపులను ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్నవే. ఒక్కముక్కలో పొరుగు దేశాలను, అంతెందుకు ప్రపంచ దేశాలన్నిం టికీ నీచంగా చూసిన హిస్టరీ డ్రాగన్‌ది. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తనది కాని రోజున ఎంతటి బలవంతుడైనా కాలం ముందు తలవంచాల్సిందే. ట్రంప్ టారిఫ్స్‌ రూపంలో జిన్‌పింగ్‌కు ఆ ‘బ్యాడ్ డే’ రానే వచ్చింది. దాని రిజల్ట్ ఏంటో టాప్ స్టోరీలో చూద్దాం..

ట్రంప్ టారిఫ్స్ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. మొదట ప్రపంచ దేశాలపై టారిఫ్స్ సంధించి షాకిచ్చిన అమెరికా ప్రెసిడెంట్.. తర్వాత 90 రోజుల వరకూ పాజ్ చేశాడు. కానీ, చైనాకు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ జిన్‌పింగ్ బలుపు. సామరస్యంగా, చర్చలతో పరిష్కరించుకోవాల్సిన వేళ.. ట్రంప్‌తో సై అంటే సై అన్నాడు. ఫలితంగా బీజింగ్‌పై 145శాతానికి టారిఫ్స్ చేరిపోయాయి. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125శాతం సుంకం విధించింది. ఇది ఇక్కడితో ఆగుతుందన్న గ్యారెంటీ లేదు. ఇది జిన్‌పింగ్‌కు కూడా తెలుసు. అందుకే, ఇప్పటివరకూ పురుగుల్లా చూసిన పొరుగు దేశాలన్నీ సడెన్‌గా జిన్‌పింగ్‌కు మిత్ర దేశాలైపోయాయి. ఆ వెంటనే కలిసి నడుద్దాం.. ట్రంప్‌ సరదా తీర్చేద్దామని కలుపుగోలు మాటలూ మొదలయ్యాయి. జిన్‌పింగ్‌‌లో ఉన్నట్టుండి వచ్చిన ఈ మార్పు చూసి మొదట ఆశ్చర్యపోయింది మన దేశమే. ఎందుకంటే, బీజింగ్ మొదట స్నేహ గీతం పాడింది భారత్‌ కోసమే.

ఇదీ ట్రంప్ టారిఫ్స్ వేళ చైనా నుంచి భారత్‌కు వచ్చిన విజ్ఞప్తి. ట్రంప్ చేపట్టిన సుంకాలను అడ్డుకునేందుకు భారత్‌- చైనా కలిసి పోరాడాలని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. “చైనా-భారత్‌ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. అమెరికా అనుసరిస్తున్న సుంకాలని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా.. ఈ ప్రతిపాదన చేయడానికి రీజన్ ట్రంప్ టారిఫ్స్‌తో జరిగే నష్టాన్ని భారత్‌ సాయంతో భర్తీ చేసుకోవడానికే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, చైనా పిలుపుపై భారత్ స్పందించలేదు. స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఇందుకు రెండు కారణాలున్నాయి. వాటిలో మొదటిది చర్చల ద్వారా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో మోడీ సర్కార్‌కు తెలుసు. ఇక రెండోది.. చైనాను నమ్మితే ఏం జరుగుతుందో కూడా తెలుసు.

భారత్‌నే కాదు చైనా ఇప్పటివరకూ శత్రువులుగా చూసిన చాలా దేశాల ముందు ఈ ప్రతిపాదనే పెట్టింది. వాటిలో ఇండో-పసిఫిక్‌‌లో డ్రాగన్ నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా కూడా ఉంది. అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో వేరే దేశాలకు తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలని చైనా ప్రణాళికలో భాగంగా.. ఆస్ట్రేలియాను తమకు కలిసిరావాలని చైనా కోరింది. కానీ, చైనా ఇచ్చిన పిలుపును ఆస్ట్రేలియా నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, చైనా చేతిని పట్టుకునే ఛాన్సే లేదని తేల్చిచెప్పింది. అదే టైంలో ఇతర దేశాలతో వాణిజ్యం చేస్తామని పేర్కొంది. నిజానికి.. ట్రంప్ టారిఫ్స్‌పై ఆస్ట్రేలియా కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కానీ, చైనా లాగా వాషింగ్టన్‌తో వైరం పెట్టుకోవాలనుకోలేదు. భారత్‌లాగే అమెరికాతో చర్చలు జరపాలని చూస్తోంది. అందుకే చైనాకు దాని ముఖంమీదే మీ చేయి పట్టుకునేది లేదని తేల్చి చెప్పింది.

భారత్ నుంచి ఆశించిన స్పందన రాలేదు, ఆస్ట్రేలియా నుంచి తిరస్కరణ వచ్చింది. ఇక లాభం లేదనుకుని తానే యాక్షన్‌లోకి దిగాలని డిసైడ్ అయ్యాడు జిన్‌పింగ్. ఈ నెల 14 నుంచి 18 వరకు వియత్నాం, మలేసియా, కంబోడియా దేశాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మూడు దేశాలకు ఆసియాన్‌ గ్రూప్‌లో సభ్యత్వం ఉంది. ఈ గ్రూప్‌, చైనా మధ్య ఏటా 962 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. దీనిలో 575 బిలియన్‌ డాలర్లు చైనా ఎగుమతులే ఉంన్నాయి. కాబట్టి ఆ దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకుని ట్రంప్ టారిఫ్స్‌ వచ్చే నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేసుకోవాలనేది జిన్‌పింగ్ ప్లాన్. ఆ తర్వాత ఇతర దేశాలతోనూ ఇలాగే కలిసి ముందుకెళ్దామని ప్రతిపాదించబోతున్నాడు. కానీ, చైనాపై భయంతో చిన్న దేశాలు అందుకు అంగీకరించే అవకాశం ఉన్నా భారత్ వంటి పెద్ద దేశాలు బీజింగ్ మాట వినే సీన్ లేదు. ఎందుకంటే డ్రాగన్‌ను నమ్మితే ఏం జరుగుతుందో దునియా మొత్తానికీ తెలుసు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో చైనా అర్ధం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. పొరుగు దేశాలకు విలువిస్తే అవి కష్టకాలంలో అండగా నిలుస్తాయి.. కాదని బలుపు చూపిస్తే ఒంటరిగా మిగలడం ఖాయం.