RS Praveen Kumar: ఎన్నికల వేళ RS ప్రవీణ్‌కు భారీ షాక్..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రవీణ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఆర్ఎస్పీ అభ్యర్థిత్వాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గులాబీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. సొంత తమ్ముడు ఆర్ఎస్ ప్రసన్నకుమార్ నుంచే ఇప్పుడు ప్రవీణ్ కుమార్‌కు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

RS Praveen Kumar: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. బీఆర్ఎస్‌ను ఖాళీ చేయడమే టార్గెట్ అన్నట్లుగా.. కాంగ్రెస్ చేరికలకు గేట్లు ఎత్తేసింది. ఒకప్పుడు బీఆర్ఎస్ సర్కార్‌లో కీలకంగా వ్యవహరించిన నేతలు.. ఒక్కొక్కరుగా హస్తం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒక్కరు బీఎస్పీని వీడి బీఆర్ఎస్‌లో చేరడం.. గులాబీ శ్రేణులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది.
Nandamuri Balakrishna: అన్‌స్టాఫుబుల్ సీజన్ 4లో ట్విస్ట్.. ఏం పర్లేదు …
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్‌ను అనౌన్స్ చేశారు కేసీఆర్. ఐతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రవీణ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఆర్ఎస్పీ అభ్యర్థిత్వాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గులాబీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. సొంత తమ్ముడు ఆర్ఎస్ ప్రసన్నకుమార్ నుంచే ఇప్పుడు ప్రవీణ్ కుమార్‌కు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో ఆలంపూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసిన ఆర్‌ఎస్ ప్రసన్న కుమార్ పోటీ చేశారు. ఆయన త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. బీఎస్పీ రాష్ట్రఅధ్యక్షుడిగా ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్.. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఐతే మాట కూడా చెప్పకుండా ప్రవీణ్‌కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరడంతో అన్నదమ్ముల మధ్య దూరం పెరిగినట్లుగా తెలుస్తోంది.
దీంతో ప్రసన్నకుమార్ తన రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌లో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో సమావేశం అయ్యారు కూడా ! సీఎం రేవంత్‌తోనూ భేటీ అయినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్‌కు రేవంత్‌రెడ్డి నుంచి భరోసా రావడంతో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇదే జరిగితే మరో మూడు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనే అవకాశం ఉంది.