AP BJP: టీడీపీ, వైసీపీతో.. బీజేపీ పాలి”ట్రిక్స్”

కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి చేదోడుగా ఉంటున్న వైఎస్ జగన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది..? జనసేన, టీడీపీ రాజకీయ విధానాల ప్రభావానికి బీజేపీ గురికాదా..? ఇన్నాళ్లూ తమకు పార్లమెంట్‌లో అండగా నిలిచిన జగన్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఎన్నికల సమర శంఖం పూరిస్తుందా..? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 7, 2023 | 11:18 AMLast Updated on: Aug 07, 2023 | 11:18 AM

Bjp Doing Politrics In Andhra Pradesh With Tdp Ysrcp

AP BJP: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్.. మూడు ట్విస్టులు, ఆరు సస్పెన్స్‌లు అన్న తీరుగా ముందుకు సాగుతున్నాయి. ఇందుకు సెంటర్ పాయింట్‌గా బీజేపీ మారింది. ఏపీలో అధికారంలో లేకున్నా.. ఫీల్డ్‌లో తగిన క్యాడర్ లేకున్నా బీజేపీ చుట్టూనే అధికార వైఎస్సాఆర్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రదక్షిణలు చేస్తున్నాయి. బీజేపీ మెప్పు కోసం ఈ రెండు పార్టీలు వీరలెవల్‌లో ట్రై చేస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి బిల్లుల ఆమోదంలో ప్రతిసారీ జగన్‌సేన ఒక్క సెకను కూడా ఆలోచించకుండా సపోర్ట్ చేస్తోంది. మరోవైపు టీడీపీ కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీల పొలిటికల్ ప్రేమను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక.. ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ ఫ్రెండ్‌షిప్ చేస్తోంది. ఎన్నికల నాటికి ఈ సీన్ మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఇద్దరినీ తమ స్నేహితుల రూపంలో చూస్తూ.. 
ఒకవేళ జనసేన-బీజేపీ-టీడీపీ కూటమి ఆవిర్భవిస్తే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి చేదోడుగా ఉంటున్న వైఎస్ జగన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది..? జనసేన, టీడీపీ రాజకీయ విధానాల ప్రభావానికి బీజేపీ గురికాదా..? ఇన్నాళ్లూ తమకు పార్లమెంట్‌లో అండగా నిలిచిన జగన్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఎన్నికల సమర శంఖం పూరిస్తుందా..? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలు, వైరుధ్యాలకు ఛాన్స్ ఇవ్వకుండా సేఫ్‌గా పొత్తును జనసేనకు మాత్రమే పరిమితం చేసుకోవాలనే ఆలోచన బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉందనే ప్రచారం జరుగుతోంది. తద్వారా ఫ్యూచర్‌లో కేంద్రంలో హంగ్ సర్కారు ఏర్పడితే.. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ, వైసీపీల సహకారాన్ని పొందొచ్చని కమల దళం పెద్దలు యోచిస్తున్నారట. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దూరం పాటిస్తున్న చంద్రబాబును, జగన్‌ను తమ స్నేహితుల రూపంలోనే బీజేపీ అధినాయకత్వం చూస్తోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే ఒకవైపు జగన్ సర్కారుకు వెంటవెంట‌నే నిధుల‌ను విడుదల చేస్తున్న కేంద్ర సర్కారు.. మరోవైపు  టీడీపీ కీల‌క నాయ‌కులు చంద్ర‌బాబు, నారా లోకేష్‌‌కు భ‌ద్ర‌త ఎలా ఉందని జగన్ సర్కారును ప్ర‌శ్నిస్తోందని గుర్తు చేస్తున్నారు. అయితే బీజేపీ వేసిన ఫ్యూచర్ ప్లాన్‌ను ఇప్పుడే అర్ధం చేసుకోలేక చాలామంది తికమక పడిపోతున్నారు. కర్ర విర‌గ‌కుండా.. పాము చావ‌కుండా అన్నట్లుగా కమల దళం అమలు చేస్తున్న వ్యూహం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్.. టీడీపీకి చెక్..?
టీడీపీ, వైఎస్సాఆర్‌సీపీకి సమదూరం పాటించే ప్లాన్‌లో భాగంగా.. బీజేపీ మరో పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయిన పవన్ కళ్యాణ్‌ను.. జనసేన-బీజేపీ కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే జనసేనతో పొత్తుకు టీడీపీకి శాశ్వతంగా తలుపులు మూసుకుపోయినట్టేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పవన్ కళ్యాణ్‌ను టీడీపీకి దూరం చేయొచ్చనే వ్యూహంతో బీజేపీ ఉందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ సమావేశం అనంతరం.. పవన్ కోరుకుంటున్న రూట్ మ్యాప్‌తో పాటు స్పష్టమైన సందేశాన్ని బీజేపీ పెద్దలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ వద్ద ఉన్న ఓ సామాజిక వర్గం ఓటుబ్యాంకు బీజేపీ, జనసేన వైపునకు  మళ్లాలన్నదే బీజేపీ జాతీయ నాయకత్వం ప్లాన్‌గా కనిపిస్తోంది. అందుకే ఇటీవల ఎన్డీఏ సమావేశానికి టీడీపీని పక్కన పెట్టి పవన్‌ని మాత్రమే ఆహ్వానించారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.