Bandi sanjay: ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్.. అని అడిగినా ఓటు పడలేదా బండి! పరువు పాయె!
బండి సంజయ్ ప్రచారం చేస్తే వచ్చే ఓట్లు కూడా పోతాయేమో.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూస్తే ఆ విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. మోదీని పొగడాలన్నా.. అమిత్‌షా భజన చేయాలన్నా.. ఓట్లు కోసం ప్రజలని ప్రాధాయపడాలన్నా.. ఆయన స్టైలే సపరేటు. గతంలో ‘ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్’ అన్న ఆయన మాటలు తెగ వైరలయ్యాయి. బండి వ్యాఖ్యలకు కేటీఆర్ వేసిన రివర్స్ పంచ్ నెట్టింట్లో హల్‌చల్ చేసింది. ఇక ఆ ఒక్కసారే కాదు..బండి సంజయ్ వేసే ప్రతి అడుగులోనూ ఏదో ఒక సెన్సెషన్ ఉంటుంది. ఆయన గురించి బయటకు వచ్చే ప్రతి వార్త ఓ ఆసక్తిని రేపుతోంది. తాజాగా కర్ణాటక ఎన్నికల్లోనూ అదే జరిగింది.
ఐదు చోట్లా ఫసక్:
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోలార్, చింతామణి, ముల్బగల్, గౌరీబిదనూర్, బాగేపల్లి, చిక్కబల్లాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున బండి సంజయ్ ప్రచారం చేశారు. నియోజకవర్గాల్లోని ప్రతి వీధీ తిరుగుతూ ప్రధాని మోదీ గురించి డప్పు కొట్టారు. అది చాలా చోట్ల లిమిట్ క్రాస్ అయ్యింది కూడా. బీజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు గురించి ప్రచారంలో ప్రస్తావించారు. అయితే బండి మాటలు బెడిసికొట్టాయి. బండిని పంక్చర్ వేసి పంపించారు కన్నడ ఓటర్లు. దీంతో ఆయన్ను ఐరెన్ లెగ్ అంటూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఎగతాళి చేస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తే తెలంగాణలోనూ కర్ణాటకలో పట్టిన గతే పడుతుందని చురకలంటిస్తున్నారు. బండి సంజయ్ ప్రచారం చేసిన కోలార్, చింతామణి, ముల్బగల్ స్థానాల్లో బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గౌరీబిదనూర్‌లో అయితే ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
ఓడిపోయింది చాలదన్నట్టు వింత వాదన:
నిజానికి ఓటమి బాధ అందరికి ఉంటుంది..అయితే గెలిచిన వాళ్లని ఓడిపోయినా రోజైనా మెచ్చుకోవడం కాస్త స్పారిటివ్‌నెస్ అనిపించుకుంటుంది. బండి సంజయ్‌కి ఇవేవీ పట్టనట్టుంది. కేవలం ఓ వర్గం ఓట్లతోనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందంటూ వింత వాదన మొదలుపెట్టారు బండి సంజయ్. కర్ణాటకలో కాంగ్రెస్ మత రాజకీయాలు చేసిందంటూ ఫైర్ అయ్యారు. నిజానికి మత రాజకీయాలకు కేరాఫ్ అయిన బీజేపీ నేతల నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లింగాయత్‌లు, దళితులు, ట్రైబల్స్, వొక్కళిగలు ఇలా అందరూ బీజేపీని పక్కకు నెట్టారు. తాను ప్రచారం చేసిన ఐదు చోట్లా బీజేపీ ఓడిపోయిందన్న బాధతో బండికి మతి భ్రమించినట్లుంది.అందుకే ఇక్కడ కూడా ఓ వర్గమంటూ విషం చిమ్మే ప్రయత్నం చేశారు. బండి ప్రచారం చేయడం వల్లే ఓడిపోయిందంటూ మరికొందరు అదే పనిగా ట్రోల్స్ చేస్తుండడంతో దానికి ఏం సమాధానం చెప్పాలో బండి సంజయ్‌కి అర్థంకాకపోవడంతో మరోసారి మతాల ప్రస్థావన తీసుకొచ్చారు. తెలంగాణలో ఇలా జరిగే ఛాన్స్ లేదంటూ జ్యోతిష్యుడిలాగా జాతకాలు చెప్పారు బండి సంజయ్.