జేసికి బిజేపి ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్…!
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బిజేపి ఎమ్మెల్యే పార్థసారధి ఫైర్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బిజేపి ఎమ్మెల్యే పార్థసారధి ఫైర్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. బిజెపి అనుబంధ సంస్థలపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం అని ఆయన హెచ్చరించారు. తగిన విధంగా బుద్ధి చెప్తామన్నారు. మూల కూర్చుని ఆడిందే ఆట పాడింది పాట అంటే సరికాదని వార్నింగ్ ఇచ్చారు.
జెసి వ్యాఖ్యలను బిజెపి ఖండిస్తుందన్నారు. బిజెపి కార్యకర్తలకు బస్సులు కాల్చి గొడవలు పెట్టే అలవాట్లు లేవన్న ఆయన బిజెపి నిర్మాణాత్మకంగా ఆలోచిస్తుందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల మార్పు కోసం బిజెపి ప్రయత్నిస్తోందని స్పష్టం చేసారు. అటు మంత్రి సత్యకుమార్ కూడా జేసి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.