బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి దూకుడు గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం
చిన్నమైల్ అంజిరెడ్డి...నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. కమలం పార్టీలో టికెట్ దక్కించుకోవడం అంటే అంత వీజీ కాదు. ఎళ్ల పాటు పార్టీ కోసం శ్రమించాలి.
చిన్నమైల్ అంజిరెడ్డి…నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. కమలం పార్టీలో టికెట్ దక్కించుకోవడం అంటే అంత వీజీ కాదు. ఎళ్ల పాటు పార్టీ కోసం శ్రమించాలి. ఫలితం ఆశించకుండా పని చేయాలి. పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలి. విలువలకు కట్టుబడి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కాషాయ పార్టీలో టికెట్ వస్తుంది. నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యూయేట్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విషయంలో అదే నిజమైంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా చిన్నమైల్ అంజిరెడ్డి పేరును ఖరారు చేసింది.
డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి…రెండు దశాబ్దాలకుగా కాషాయ పార్టీనే నమ్మకున్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ సిద్దాంతాల కోసం ఎక్కడా రాజీ పడలేదు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. రెండు దశాబ్దాలకుపైగా బీజేపీని బలోపేతం చేసేలా పని చేశారు. ఆయన సేవలను గుర్తించిన కమలం పార్టీ హైకమాండ్…చిన్నమైల్ అంజిరెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. బీజేపీలో రాష్ట్ర నాయకునిగా కొనసాగుతూ మరోవైపు ఎస్ఆర్ ట్రస్టు ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గం నుండి బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్టును ఆశించినా అధిష్టానం టికెట్టు కేటాయించలేదు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను బీజేపీ పార్టీ అధిష్టానం ప్రకటించింది.
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు పార్టీల అభ్యర్థుల ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అంజిరెడ్డి సతీమణి గోదావరి సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అంజిరెడ్డికి పార్టీ కార్యకర్తల్లో, యువతలో మంచి క్రేజీ ఉండడంతో అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డికి అవకాశం రావడం పట్ల బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
యువ వికాసం పేరుతో యువతను మోసగించిన కాంగ్రెస్ తీరును..ఓటర్లకు వివరిస్తున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తానని గ్రాడ్యూయేట్లకు హామీ ఇస్తున్నారు అంజిరెడ్డి. నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు చిన్నమైల్ అంజిరెడ్డి. బీజేపీ అధిష్ఠానం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా…కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.