AP BJP Tickets: సీనియర్లకు హ్యాండిచ్చిన బీజేపీ.. హడావిడి బ్యాచ్‌ని పక్కన పెట్టిన కమలం పెద్దలు..!

ఈ జాబితాలో పార్టీ కోసం అంత కష్టపడ్డాం.. ఇంత కష్టపడ్డాం అని చెప్పుకునే నేతలకు మాత్రం చోటు దక్కలేదు. దీంతో చాలా మంది సీనియర్లు డీలా పడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యంగా సోమువీర్రాజు, జీవీఎల్, మాధవ్‌, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్‌ లాంటి వారి పేర్లు లిస్ట్‌లో లేవు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2024 | 07:24 PMLast Updated on: Mar 26, 2024 | 7:24 PM

Bjp Not Allotted Tickets To Seniors In Ap Only Few Got Tickets

AP BJP Tickets: ఏపీ బీజేపీ ఎంపీ స్థానాల అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటించేసింది. తాము పోటీ చేసే ఆరు పార్లమెంట్ స్థానాలపై క్లారిటీ ఇచ్చేసింది. కానీ.. ఈ జాబితాలో పార్టీ కోసం అంత కష్టపడ్డాం.. ఇంత కష్టపడ్డాం అని చెప్పుకునే నేతలకు మాత్రం చోటు దక్కలేదు. దీంతో చాలా మంది సీనియర్లు డీలా పడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యంగా సోమువీర్రాజు, జీవీఎల్, మాధవ్‌, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్‌ లాంటి వారి పేర్లు లిస్ట్‌లో లేవు. సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు. ప్రస్తుతం జాతీయ కార్యవర్గంలో ఉన్నారు. మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా జాతీయ నాయకత్వం దగ్గర పలుకుబడి ఉందని చెప్పుకుంటారు.

MLC KAVITHA: తిహార్ జైలులో కవిత కోసం స్పెషల్‌ ఏర్పాట్లు..

ఈ క్రమంలో సోము వీర్రాజు.. రాజమండ్రి ఎంపీ సీట్లో పోటీ చేయాలనుకున్నారు. అయితే అధిష్టానం ఆయనకు కాకుండా.. పురందేశ్వరికి టిక్కెట్‌ ఇచ్చింది. అలాగే జీవీఎల్ విశాఖలో రెండున్నరేళ్ల నుంచి మకాం వేసి పని చేసుకుంటున్నారు. కానీ ఆ స్థానం దక్కకపోవడంతో.. అనకాపల్లి టిక్కెట్‌ అయినా ఇవ్వాలని జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. కానీ ఆ స్థానాన్ని సీఎం రమేష్‌కు కేటాయించింది బీజేపీ హైకమాండ్‌. దీంతో సోము నిరాశగా ఉన్నట్టు తెలిసింది. ఇక టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారిలో విష్ణువర్దన్ రెడ్డి ఉన్నారు. కదిరి అసెంబ్లీ లేదా.. హిందూపురం పార్లమెంట్‌ స్థానాలను ఆశించారాయన. ఈ రెండు స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోవడంతో విష్ణువర్దన్ రెడ్డికి నిట్టూర్పులే మిగిలాయి. మరో సీనియర్ నేత సత్యకుమార్. ఆయన రాజంపేట లేదా హిందూపురం పార్లమెంట్‌ స్థానాలు ఆశించారు. ఈ రెండింటిలో ఒకటి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కేటాయించగా.. మరోటి టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే గుడ్డిలో మెల్లలా సత్యకుమార్ పేరును ధర్మవరం అసెంబ్లీ స్థానానికి పరిశీలిస్తోంది పార్టీ అధినాయకత్వం. ఈ క్రమంలో ఏపీ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీనియర్ నేతలుగా ఉన్న వారికి అయితే టిక్కెట్లు దక్కకపోవడమో.. లేక అసెంబ్లీ స్థానాలకు వెళ్లాలని అధిష్టానం సూచించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

KTR on Media: 16 మీడియా సంస్థలపై KTR ఫ్యామిలీ కేసులు !

సీనియర్స్‌ అంతా ఎంపీ స్థానాలని పట్టుకుని వేలాడితే ఎలాగని, అసెంబ్లీకి పోటీ చేస్తే పార్టీ కూడా క్షేత్ర స్థాయిలో మరింతగా బలోపేతమవుతుందంటూ అందరికీ పార్టీ పెద్దలు క్లాస్‌ పీకినట్టు తెలిసింది. దీంతో సత్యకుమార్‌, సోము వీర్రాజు ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి బరిలో దిగవచ్చంటున్నారు. ఈ పరిస్థితుల్లో సోము వీర్రాజు పేరు అనపర్తి సెగ్మెంట్ నుంచి పరిశీలనలో ఉన్నప్పటికీ.. అక్కడ పోటీకి ఆయన ఆసక్తి లేన్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇక సుజనా చౌదరి విజయవాడ వెస్ట్‌ లేదా కైకలూరు సెగ్మెంట్లలో ఒకచోట పోటీ చేసే సూచనలున్నాయి. ఇంకొందరు సీనియర్‌ నేతలు అసెంబ్లీ బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం బీజేపీ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. ఇదే సందర్బంలో మరో చర్చా జరుగుతోంది. తామే ఏపీలో బీజేపీకి క్షేత్ర పాలకులం అని బిల్డప్‌ ఇచ్చిన వారిని పక్కన పెట్టి పార్టీ కోసం సిన్సియర్‌గా.. లాయల్‌గా.. రియల్‌ టైంలో పనిచేస్తూ.. లో ప్రోఫైల్ మెయిన్‌టెన్‌ చేస్తున్న వారికి మాత్రమే ఇచ్చారన్నది దాని సారాంశం. ఇప్పుడు టిక్కెట్లు దక్కించుకున్న ఆరుగురు అభ్యర్థుల జాబితాలో నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ పేరు చర్చనీయాంశమైంది.

పార్టీ కోసం లాయల్‌గా పని చేయడం.. చెప్పింది చేయడం తప్ప.. ఎక్కువగా ప్రెస్‌ మీట్లు పెట్టడం, అనవసర ఆర్భాటాలకు వెళ్లడం లాంటివి చేయలేదట ఆయన. అందుకే ఆయన్ని టిక్కెట్‌ వరించిందని అంటున్నారు. అలాగే ఇంకా అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు ప్రకటించకున్నప్పటికీ.. ఆదోని నుంచి పార్ధ డెంటల్‌ అధినేత పార్దసారధి విషయంలో కూడా ఇదే తరహా చర్చ జరుగుతోంది. ఆయనకు కూడా సిన్సియర్‌ కార్యకర్తగా పార్టీలో పేరు ఉందట. ఈ తరహాలో కష్టపడే వారికి టిక్కెట్లు రావడం పార్టీ ఎదుగదలకు శుభపరిణామం అంటున్నాయట ఏపీ బీజేపీ వర్గాలు. మొత్తానికి బీజేపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం రకరకాల చర్చలకు తెరలేపింది.