TDP-BJP-JANASENA: అభ్యర్థులను ఇంకా ప్రకటించని బీజేపీ.. ఆలస్యానికి అసలు కారణాలివేనా?
బీజేపీ మాత్రం అభ్యర్థుల ప్రకటన విషయంలో మౌనంగా ఉంది. ఇప్పటివరకు ఒక్కరి పేరు కూడా అనౌన్స్ చేయలేదు. దీంతో ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయ్. అసలు బీజేపీ పెద్దల మనసులో ఏముంది..? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.
TDP-BJP-JANASENA: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరి చాలా రోజులు అయింది. టీడీపీ రెండు లిస్ట్‌లు కూడా అనౌన్స్ చేసింది. పవన్ కూడా ముందు ఐదుగురిని ప్రకటించి.. ఆ తర్వాత ఒక్కొక్కరి పేరు అనౌన్స్ చేస్తున్నారు. ఐతే బీజేపీ మాత్రం అభ్యర్థుల ప్రకటన విషయంలో మౌనంగా ఉంది. ఇప్పటివరకు ఒక్కరి పేరు కూడా అనౌన్స్ చేయలేదు. దీంతో ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయ్. అసలు బీజేపీ పెద్దల మనసులో ఏముంది..? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.
MLC KAVITHA: రూ.192 కోట్లు ఏం చేశావు..? కవితకు ఈడీ ప్రశ్నల వర్షం
ఐతే ఎవరెవరికి ఏ సీట్లు ఇవ్వాలనేది ఒకటైతే.. వారికి టీడీపీ, జనసేన మద్దతు ఉంటుందా లేదా అనుమానం మరొకటి. ఈ రెండు కారణాలతోనే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు దక్కాయ్. ఇక అభ్యర్థుల విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీకి బలంగా ఉండేవారితో పాటు.. టీడీపీ, జనసేన నుంచి మద్దతు కచ్చితంగా ఉంటుందనుకునే అభ్యర్థులనే సెలక్ట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. లేదంటే పొత్తు ప్రయోజనం లేకుండా పోతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. నిజానికి ఈ విషయమే చెప్పడానికి.. పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. చంద్రబాబు, పవన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సోము వీర్రాజు, మాధవ్, జీవీఎల్, విష్ణు వర్ధన్ రెడ్డి కూడా.. బీజేపీ తరఫున టికెట్లు ఆశిస్తున్నారు. వీరిలో ఇద్దరికి జనసేనతో పొత్తు ఇష్టం లేదు.
నలుగురికి టీడీపీతో పొత్తు అసలు ఇష్టం లేదు. దీంతో టీడీపీ, జనసేన కూడా ఈ నలుగురిని వ్యతిరేకిస్తున్నాయ్. అందుకే అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది. ఇక అటు మరో ప్రచారం కూడా జరుగుతోంది. తాము ఓడిపోతామనుకున్న స్థానాలను.. బీజేపీకి టీడీపీ కట్టబెట్టిందని.. ఈ విషయంలోనూ సొంత పార్టీలో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని.. ఈ భయం కూడా అభ్యర్థుల ప్రకటనకు బ్రేక్ వేసిందనే ప్రచారం జరుగుతోంది.