BJP: కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు బీజేపీ సూపర్‌ ప్లాన్‌.. వరుస నిరసనలతో బీఆర్ఎస్‌కు ఝలక్!

తెలంగాణను ఎట్టి పరిస్థితులలో వదిలేది లేదని బీజేపీ ఫిక్స్ అయింది. ఇక్కడ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తుండగా.. హస్తం పార్టీతో పాటు బీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చేలా భారీ స్ట్రాటజీ సిద్ధం చేసింది బీజేపీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 3, 2023 | 11:48 AMLast Updated on: Jun 03, 2023 | 11:48 AM

Bjp Planning To Conduct Programmes To Counter Trs

BJP: కర్ణాటకలో జరిగిందేదో జరిగిపోయింది. తెలంగాణను ఎట్టి పరిస్థితులలో వదిలేది లేదని బీజేపీ ఫిక్స్ అయింది. ఇక్కడ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తుండగా.. హస్తం పార్టీతో పాటు బీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చేలా భారీ స్ట్రాటజీ సిద్ధం చేసింది బీజేపీ.

గులాబీ పార్టీ మీద జనాల్లో ఉన్న వ్యతిరేకతను ఆయుధంగా మార్చుకోవడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీకి ఆదరణ పెరిగేలా సరికొత్త ప్లాన్‌ సిద్ధం చేసింది. దీనిలో భాగంగా.. బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి గట్టి కౌంటర్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది కమలం పార్టీ. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాలను భారీగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైన వేళ.. వరుస నిరసనలతో షాక్ ఇచ్చే విధంగా ప్లాన్‌లు సిద్ధం చేస్తోంది. వివిధ రంగాల వారీగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను వినూత్న రీతిలో జనాలకు అర్థమయ్యే విధంగా ప్లాన్ చేస్తోంది. ఈ నెల 22వ తేదీ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది.

దీనిలో భాగంగా సీనియర్ నాయకులందరినీ.. ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. రైతు దినోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని బీఆర్ఎస్ సర్కార్‌ ప్లాన్‌ చేయగా.. దానికి కౌంటర్‌గా కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం ఎలా దెబ్బతింది.. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఎలా విఫలమైంది.. అనే అంశాల్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. పోలీస్ వ్యవస్థను కేసీఆర్ కుటుంబం సొంత ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనే అంశంతో పాటు, పోలీసులు పడుతున్న ఇబ్బందులను జనాలకు తెలిపేలా జూన్ 4న కార్యక్రమాలు నిర్వహించనుంది.

జూన్ 5న విద్యుత్ చార్జీల పెంపుతో జనాలపై పడుతున్న భారంపై నిరసనలు.. జూన్ 6న సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ.. 7న చెరువుల కబ్జా… 8న సంక్షోభంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం… 9న కేసీఆర్ అవినీతి.. 10న దశాబ్ది తెలంగాణలో కవులు, కళాకారులకు జరుగుతున్న అన్యాయం.. ఇలా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో దూసుకుపోయేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. జూన్ 22 వరకు ఇలాంటి కార్యక్రమాలే నిర్వహించనున్నారు. కర్ణాటక విజయం తర్వాత జోష్ తగ్గిన బీజేపీకి.. ఈ కార్యక్రమాలు ఉత్సాహం తీసుకువస్తాయో లేదో చూడాలి.