BJP MP’S: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మాజీ సీఎంలు.. ఈసారైనా గెలుస్తారా..!

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్, రావత్, బస్వరాజ్ బొమ్మై లాంటి వారు పోటీకి దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన వారికి, మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వని వారిని ఎంపీలుగా నిలబెట్టంది బీజేపీ హైకమాండ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2024 | 07:36 PMLast Updated on: Mar 14, 2024 | 7:36 PM

Bjp Selected Sex Cms As Mp Candidates For Loksabha Elections

BJP MP’S: మోడీ 3.0 ప్రభుత్వం కోసం ఈసారి అన్ని రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులను లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దించుతున్నారు. హిందీ బెల్ట్ ఏరియాల్లో కంటే మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తోంది బీజేపీ. ఈసారి 370 సీట్లు టార్గెట్‌గా పెట్టుకోవడంతో.. మాజీ ముఖ్యమంత్రులైతే గెలవడానికి అవకాశం ఉంటుందని కూడా కమలం పార్టీ భావిస్తోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్, రావత్, బస్వరాజ్ బొమ్మై లాంటి వారు పోటీకి దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన వారికి, మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వని వారిని ఎంపీలుగా నిలబెట్టంది బీజేపీ హైకమాండ్.

One Nation, One Election: వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. సాధ్యమేనా.. కోవింద్ కమిటీ సూచనలివే..

ఆ పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలో వీళ్ళ పేర్లే ఎక్కువగా ఉన్నాయి. రెండు లిస్టుల్లో ఇప్పటిదాకా 267 మంది పేర్లను బీజేపీ ప్రకటించగా.. అందులో సిట్టింగ్ ఎంపీల్లో 21శాతం మందికి మళ్ళీ టిక్కెట్లు ఇవ్వలేదు. హర్యానా మాజీ సీఎం ఖట్టర్ కర్నాల్ నుంచి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి, కర్ణాటక మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మై హవేరి నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. త్రిపుర మాజీ సీఎం విప్లవ్ దేబ్ త్రిపుర వెస్ట్ నుంచి అలాగే రాజ్యసభ ఎంపీగా ఉన్న అస్సాం మాజీ సీఎం సర్వానంద సోనోవాల్ ను దిబూగఢ్ నుంచి లోక్‌సభ బరిలోకి దింపింది బీజేపీ అధిష్టానం. మాజీ సీఎంలే కాదు.. రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళని, ఆయా రాష్ట్రాల్లో సీనియర్ నేతలకు కూడా లోక్ సభ టిక్కెట్లు ఇచ్చింది. ఇంతమంది మాజీ సీఎంలను ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దించడానికి ముఖ్యకారణం.. టార్గెట్ 370. మాజీ ముఖ్యమంత్రులకు రాష్ట్రాల్లో మంచి వెయిట్ ఉంటుందనీ.. వీళ్ళయితే గెలవడానికి ఈజీగా అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఈసారి అధికారం చేపడితే ఈ మాజీ సీఎంల పరిపాలనా అనుభవం కూడా పనికొస్తుందని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు.

అయితే ఈ ప్రయోగం హిందీ బెల్ట్ ఏరియాల్లో ఎక్కువగా అమలు చేయలేదు. బీజేపీ అనుసరించిన మాజీ సీఎంల వ్యూహానికి అపోజిట్‌గా వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. తమ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రుల కొడుకులకు లోక్ సభ టిక్కెట్లు ఇచ్చింది. గౌరవ్ గొగోయ్, వైభవ్ గెహ్లాట్, నకుల్ నాథ్ లాంటి వాళ్ళు ఈసారి లోక్ సభకు పోటీచేస్తున్నారు. బీజేపీ మాజీ ముఖ్యమంత్రులను దించడానికి మరోకారణం కూడా ఉంది. ఇటీవల కాలంలో బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో పాత సీఎంలను కాదని కొత్తవాళ్ళకి అవకాశాలు ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానాల్లో అదే పనిచేసింది. అయితే మాజీలు మరో పవర్ సెంటర్‌గా ఉండి.. ప్రస్తుత సీఎంలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకే వాళ్ళని లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దించినట్టు కూడా భావిస్తున్నారు.