Bjp Eye on Telangana: తెలంగాణపై బీజేపీ ఫోకస్.. ఇక తెలంగాణలో ఆట షురూ.. రచ్చగా మారనున్న రాజకీయం!

ఈ ఏడాది చివరిలోపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు ఆరు నెలలు సమయం మాత్రమే ఉంది. ఆలోపే రాజకీయ పార్టీలు తమ అస్త్రాల్ని సిద్ధం చేసుకోవాలి. పార్టీని బలోపేతం చేయాలి. ఓటర్లను ఆకట్టుకోవాలి. ఇకపై తెలంగాణలో అన్ని పార్టీలూ ఇదే పనిలో ఉండబోతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 3, 2023 | 02:01 PMLast Updated on: May 03, 2023 | 2:01 PM

Bjp Steps Up Efforts In Telangana War Will Starts Soon Between

Bjp Eye on Telangana: కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుతుంది. మరో వారంలో ఎన్నికలు.. ఆపై ఫలితాలు. ఫలితం ఏదైనా కర్ణాటక నుంచి బీజేపీ ఇతర రాష్ట్రాలపైకి ఫోకస్ చేయబోతుంది. ప్రధానంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేస్తుంది. ఇక ఇప్పటి నుంచి తెలంగాణలో అసలుసిసలు ఎన్నికల వేడి ప్రారంభమవుతుంది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా తెలంగాణ రాజకీయం సాగుతుంది.
ఈ ఏడాది చివరిలోపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు ఆరు నెలలు సమయం మాత్రమే ఉంది. ఆలోపే రాజకీయ పార్టీలు తమ అస్త్రాల్ని సిద్ధం చేసుకోవాలి. పార్టీని బలోపేతం చేయాలి. ఓటర్లను ఆకట్టుకోవాలి. ఇకపై తెలంగాణలో అన్ని పార్టీలూ ఇదే పనిలో ఉండబోతున్నాయి. ప్రధానంగా బీజేపీ తెలంగాణపై ఇకనుంచి గట్టిగా ఫోకస్ చేయనుంది. బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కూడా మూడోసారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. దీంతో ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ వార్ ప్రారంభం కాబోతుంది. ఇక తెలంగాణలో అసలుసిసలైన రాజకీయం షురూ అవుతుంది.
ఆట మొదలెట్టనున్న బీజేపీ
గతంలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. అందుకే ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి వరుసగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, ఇతర నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. బీజేపీని తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇకపై మరింత దూకుడుగా వ్యవహరించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటిదాకా ఆ రాష్ట్రంపై ఫోకస్ చేసిన బీజేపీ పెద్దలు.. ఇకపై తెలంగాణ మీద దృష్టి పెట్టబోతున్నారు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ దూసుకెళ్లబోతుంది.

Bjp Eye on Telangana
తట్టుకోలేకపోతున్న బీఆర్ఎస్
బీజేపీ దూకుడును బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. గత ఎన్నికల్లో బీజేపీ తెలంగాణపై పెద్దగా ఫోకస్ చేయలేదు. అందుకే తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యేకే పరిమితమైంది. కానీ, ఈసారి అలా కాదు.. అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ వైఖరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, కేటీఆర్‌కు మింగుడుపడటం లేదు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి, ఆ పార్టీల ఉనికే లేకుండా చేయడంతో రెండోసారి కూడా కేసీఆర్ విజయం సాధ్యమైంది. కానీ, ఈసారి అలా కాదు. బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా బలపడుతోంది. అందుకే ఎటూపాలుపోని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీగా మార్చిన తర్వాత సొంత రాష్ట్రమైన తెలంగాణలో అధికారం కోల్పోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే మళ్లీ ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కొత్త పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా భారీగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. అనేక రాజకీయ అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కూడా దూసుకెళ్తోంది. పార్టీ నేతలు ఎక్కువగా ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ బలపడుతున్నట్లే కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ బలపడితే కేసీఆర్‌కు దెబ్బే. అయితే, రెండు పార్టీల వల్ల వ్యతిరేక ఓటు చీలి తనకే లాభం కలుగుతుందనే ఆలోచనతో కూడా కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అవసరమైతే రాబోయే ఎన్నికల్లో గెలిచే కాంగ్రెస్ నాయకులను తన పార్టీలో చేరేలా చేసి, అధికారం దక్కించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
బీఆర్ఎస్ అవినీతే అస్త్రంగా
బీఆర్ఎస్ విజయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. దీనిలో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత, ఇతర కుటుంబ సభ్యులు ఉన్న అంశాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఇతర స్కాంలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. దళిత సీఎం, దళితులకు మూడెకరాల పంపిణీ, నిరుద్యోగ భృతి, పేపర్ లీకేజీ, పేదల ఇండ్ల నిర్మాణం వంటి అనేక అంశాల్ని ప్రజలకు వివరించబోతుంది. మరోవైపు ఆ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలకు కూడా బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి, కుటుంబ పాలన, హామీలు అమలు చేయకపోవడం వంటి బీఆర్ఎస్ వైఫల్యాల్ని ప్రజలకు వివరించడం ద్వారా ఆ పార్టీని అధికారానికి దూరం చేయాలని ప్రయత్నిస్తోంది.
పోటాపోటీ విమర్శలు
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్.. మూడు పార్టీల మధ్య పోరు సాగబోతుంది. ప్రధానంగా బీజేపీ-బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం మరింత వేడిగా మారబోతుంది. మోదీ వైఫల్యాలపై కేసీఆర్, కేటీఆర్ ఫోకస్ చేయబోతుంటే.. కేసీఆర్ వైఫల్యాలపై బీజేపీ పోరుకు సిద్ధమవుతోంది. దీంతో రానున్న రోజుల్లో పూర్తి రాజకీయ వాతావరణం కనిపంచబోతుంది.