BJP: బీజేపీకి దక్షిణాది దెబ్బ తప్పదా..? ఈసారి సత్తా చాటుతుందా..?
2019 ఎన్నికల్లో ఎన్‌డీయే కూటమి 351 సీట్లు గెలుచుకుంది. అందులో బీజేపీకి దక్కినవి 303. వీటిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో గెలుచుకుంది 29 సీట్లైతే.. అత్యధికంగా కర్ణాటకలోనే 25 సీట్లు గెలిచింది. మిగిలిన నాలుగు స్థానాలు తెలంగాణ నుంచి వచ్చినవే. తమిళనాడు, కేరళ, ఏపీల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది.
BJP: దేశవ్యాప్తంగా 400 లోక్‌సభ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. మొత్తం 543 స్థానాల్లో ఈసారి బీజేపీ లక్ష్యమిది. అయితే, అది సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. కారణం.. దక్షిణాది రాష్ట్రాలే. ఉత్తరాదిలో బీజేపీ ఎంతగా దూసుకుపోతున్నా.. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో సత్తా చాటలేకపోతోంది. ఒక్క కర్ణాకటలో మాత్రమే మెజారిటీ సీట్లు సాధిస్తూ వస్తోంది.
Shamshabad, Cheetah : శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్ వే పక్కన చిరుత కలకలం…
2019 ఎన్నికల్లో ఎన్‌డీయే కూటమి 351 సీట్లు గెలుచుకుంది. అందులో బీజేపీకి దక్కినవి 303. వీటిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో గెలుచుకుంది 29 సీట్లైతే.. అత్యధికంగా కర్ణాటకలోనే 25 సీట్లు గెలిచింది. మిగిలిన నాలుగు స్థానాలు తెలంగాణ నుంచి వచ్చినవే. తమిళనాడు, కేరళ, ఏపీల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది. అంతేకాదు.. లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో లోక్‌సభ సీటు ఉన్నప్పటికీ గెలుచుకోలేకపోయింది. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో 129 సీట్లుంటే బీజేపీకి వచ్చినవి 29 మాత్రమే. అంటే.. ఇక్కడ బీజేపీ ప్రభావం ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ.. బీజేపీ తన ప్రయత్నాల్ని వదలడం లేదు. ఈసారి గతంలో కంటే మెరుగ్గానే సీట్లు సాధించే అవకాశం ఉంది. కానీ, బీజేపీ చెబుతున్న 400 సీట్ల లక్ష్యం నెరవేరాలంటే.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ అధిక సీట్లు గెలవాలి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అదంత ఈజీ కాదనిపిస్తోంది. ఇన్నేళ్లలో కేరళలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందంటే.. అక్కడ ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. అక్కడ అన్నామలై సహా ఒకట్రెండు సీట్లు దక్కొచ్చు.
ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తులో ఉంది. ఇక్కడ కూడా రెండు లేదా మూడు సీట్లు గెలవొచ్చు. పొత్తు అంశాలు కలిసొస్తేనే ఈ గెలుపు సాధ్యమవుతుంది. తెలంగాణలో కొంచెం మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ.. నాలుగైదు స్థానాలకే పరిమితం కావొచ్చు. కానీ, కర్ణాటకలో మాత్రం ఈసారికూడా ఎక్కువగానే సీట్లు గెలుస్తుందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక్కడి రాష్ట్రాల్లో హిందూత్వ అంశానికి పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం కూడా బీజేపీ రాణించకపోవడానికి కారణం. ఏదేమైనా.. బీజేపీ 400 సీట్లు గెలుచకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో గెలుపు ఆ పార్టీకి కీలకం.