BJP VICTORY: కమల వికాసం.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం..

మధ్యప్రదేశ్‌లో కనీసం నెక్ టు నెక్ ఉంటుందని ఆశించిన కాంగ్రెస్‌కి ఊహించని షాక్ తగిలింది. ఈసారి మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కి.. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం దాకా ఫ్రీహ్యాండ్ ఇచ్చినా కాంగ్రెస్‌కి విజయం దక్కలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2023 | 08:11 PMLast Updated on: Dec 03, 2023 | 8:12 PM

Bjp Won In Three States In Madhyapradesh Rajasthan

BJP VICTORY: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్hతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోనూ కమలం పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోతోంది. మూడు హిందీ హార్ట్ ల్యాండ్స్‌లో విజయం సాధించడంపై ప్రధాని మోడీ స్పందించారు. తమపై విశ్వాసం ఉంచి అధికారం కట్టబెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ని 65 స్థానాల దగ్గరే నిలిపేసింది. మధ్యప్రదేశ్‌లో కనీసం నెక్ టు నెక్ ఉంటుందని ఆశించిన కాంగ్రెస్‌కి ఊహించని షాక్ తగిలింది. ఈసారి మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కి.. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం దాకా ఫ్రీహ్యాండ్ ఇచ్చినా కాంగ్రెస్‌కి విజయం దక్కలేదు.

Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా..? రియల్టర్లు, కాంట్రాక్టర్ల బేజార్..!

కౌంటింగ్ మొదలు పెట్టేముందు వరకూ తమ పార్టీయే విజయం సాధిస్తుందని కమల్ నాథ్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయింది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఆ రాష్ట్రంలో 30యేళ్ళుగా ఓ సంప్రదాయం కొనసాగుతోంది. ఒకసారి గెలిచిన పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే అలవాటు రాజస్థాన్ ప్రజలకు లేదు. అందుకేనేమో.. కాంగ్రెస్ ని ఓడించి మళ్ళీ బీజేపీకి పట్టంగట్టారు. పైగా హస్తం పార్టీలో అంతర్గత కలహాల వల్లే ఓడిపోయినట్టు క్లియర్ గా అర్థమవుతోంది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య గొడవలే ఇందుక్కారణం. రాజస్థాన్ లోని తూర్పు ప్రాతంలో గుజ్జర్ల ప్రభావం ఎక్కువ. వాళ్ళంతా కాంగ్రెస్ ను కాకుండా ఈసారి కమలం పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. అటు పశ్చిమ ప్రాంతంలోనూ బీజేపీకే ఎక్కువ స్థానాలు దక్కాయి.

ఈ ఫలితాలను ఊహించలేదన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. తమ పథకాలు జనంలోకి సరిగా చేరలేదన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ రాష్ట్రంలో బీజేపీకే విజయం దక్కుతుందని చెప్పాయి. ఛత్తీస్ గఢ్ లో బీజేపీకి విజయం.. నిజంగా ఆ పార్టీ కూడా ఊహించలేదు. అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలిచే ఛాన్సుందని చెప్పాయి. ఓట్ల లెక్కింపు మొదలైనప్పుడు కూడా కాంగ్రెస్ హవా కనిపించింది. కానీ తర్వాత ఫలితాలన్నీ బీజేపీ వైపు టర్న్ అయ్యాయి. ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు క్లియర్ మెజారిటినీ సాధించింది కమలం పార్టీ. తెలంగాణలో బీజేపీ మూడో స్థానానికి పడిపోయినా.. మిగతా మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం ఆ పార్టీ హైకమాండ్‌లో సంతోషం నింపింది. ప్రధాని నరేంద్రమోడీపై విశ్వాసంతోనే మూడు రాష్ట్రాల్లోని ప్రజలకు బీజేపీకి ఓట్లేశారని అంటున్నారు ఆ పార్టీ లీడర్లు. డబుల్ ఇంజిన్ సర్కార్‌ను కోరుకుంటున్నారనీ, కాంగ్రెస్ గ్యారంటీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తామన్న జోష్ కమలం పార్టీలో కనిపిస్తోంది.

ఫలితాలపై ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే ఇండియా కూటమి 2024లో అధికారంలోకి రావడం అసాధ్యమని అన్నారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా. అన్ని పార్టీలు కలసి పోరాటం చేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ఖర్గే మాత్రం… మూడు రాష్ట్రాల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని.. ఇండియా కూటమిలోని పార్టీలతో కలసి 2024 లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు. ఇక రాహుల్ గాంధీ కూడా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో ప్రజాతీర్పు గౌరవిస్తామన్నారు.