AP BJP: ఒక్కటి గెలవకున్నా.. అన్ని వాళ్లవే! ఏపీలో బీజేపీ పొలిటికల్ గేమ్ ఇదే..
ఏపీ రాజకీయాల్లో జనసేన దూరం అయినంత మాత్రాన.. బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేదు. బలపడే చాన్స్ మిస్ అవుతుంది కాకపోతే ! ఐతే అన్ని పార్టీల గ్రిప్ తమ చేతుల్లో ఉంచుకొని.. రాబోయే రోజుల్లో కమలం పార్టీ ఏపీలో పొలిటికల్ గేమ్ ఆడడం ఖాయం.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీ ఉంది అంటే.. ఉంది అంతే ! అధికారం దక్కించుకునేంత బలం, అధికారాన్ని మార్చేంత బలగం లేదు ఆ పార్టీకి ! ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా.. సొంతంగా ఒక్కసీటు గెలిచే పరిస్థితి లేదు కమలానికి ! ఐనా సరే.. ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఎప్పుడూ కీలకమే ! ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా.. ఒక్క సీటు రాకున్నా.. అన్ని స్థానాలు తమవే.. అన్ని నియోజకవర్గాల్లో గెలిచింది తమవాళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ పార్టీ తీరు ! టీడీపీతో పొత్తుకు సిద్ధం అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన పవన్.. బీజేపీకి హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో కమలం పార్టీ ఆశలన్నీ అన్ని ఆవిరి అయిన పరిస్థితి. జనసేనలాంటి పార్టీని, పవన్‌కల్యాణ్‌లాంటి నాయకుడిని ముందు పెట్టి.. ఏపీలో బలపడాలని బీజేపీ వ్యూహాలు రచించింది. కేంద్రం నుంచి అంతా క్లియర్‌గానే ఉన్నా.. రాష్ట్ర స్థాయి నేతల తీరుతో.. ఈ ఫార్ములా అంతగా వర్కౌట్ కాలేదు. చూసీ చూసీ టీడీపీ వైపు నడవాలని ఫిక్స్ అయ్యారు పవన్ కల్యాణ్. టీడీపీతో కలిసేందుకు బీజేపీ కలిసే ప్రసక్తే లేదు. అలా అని ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు దక్కించుకోవడం కూడా కష్టమే ! ఐతే ఏపీలో ఒక్క సీటు గెలవకపోయినా.. అన్ని స్థానాలు బీజేపీవే ! నిజంగానే ఇది నిజం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు బీజేపీతో అవసరం ఉంటుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే వైసీపీ, టీడీపీ, జనసేన.. ఇలా మూడు పార్టీల పిలకలు బీజేపీ చేతిలోనే ఉంటాయ్. అందుకే బలం లేదని.. ఎన్నికల్లో గెలిచిన బలగం లేదని బాధపడాల్సిన అవసరం తమకు లేదు అన్నది బీజేపీ నేతల అభిప్రాయం. ఒక్క సీటు లేకపోయినా.. అన్ని సీట్లు బీజేపీవే! ఇకపై బీజేపీ ఆడబోయే సూపర్ గేమ్ కూడా అదే ! అందుకే పవన్ పక్కకు జరిగినా.. తగ్గేదే లే అన్నట్లుగా బీజేపీ ముందుగు అడుగులు వేసే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాల్లో జనసేన దూరం అయినంత మాత్రాన.. బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేదు. బలపడే చాన్స్ మిస్ అవుతుంది కాకపోతే ! ఐతే అన్ని పార్టీల గ్రిప్ తమ చేతుల్లో ఉంచుకొని.. రాబోయే రోజుల్లో కమలం పార్టీ ఏపీలో పొలిటికల్ గేమ్ ఆడడం ఖాయంగా కనిపిస్తుంది అన్నది మాత్రం క్లియర్.