Radhika Sarathkumar: రాధిక మీద పోటీకి కెప్టెన్ కొడుకు.. ఆయనకే టికెట్ ఎందుకంటే..
రాధికకు పోటీగా సమఉజ్జీని బరిలోకి దింపింది అన్నాడీఎంకే. దీంతో విరుధునగర్ ఫైట్.. ఆసక్తి రేపుతోంది. శరత్‌కుమార్, రాధిక కలసి పెట్టిన పార్టీని.. కొద్దిరోజుల కింద బీజేపీలో విలీనం చేశారు. ఆ తర్వాత విరుధునగర్ స్థానం నుంచి రాధికా శరత్‌కుమార్‌కు సీటు కేటాయించింది బీజేపీ.
Radhika Sarathkumar: దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఫిక్స్ అయింది. తెలంగాణ, తమిళనాడులో పరిస్థితులు ఆశాజనకంగా ఉండడంతో.. ప్రత్యేకంగా దృష్టిసారిస్తోంది కమలం పార్టీ. అభ్యర్థుల విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ స్థానం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ప్రముఖ సినీ నటి రాధిక ఇక్కడి నుంచి బీజేపీ తరఫున బరిలో నిలవడంతో.. ఫలితం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి కనిపిస్తోంది.
HYPER ADI: పవన్ కోసం హైపర్ ఆది.. ఏం చేయబోతున్నాడో తెలుసా..
ఇక అటు రాధికకు పోటీగా సమఉజ్జీని బరిలోకి దింపింది అన్నాడీఎంకే. దీంతో విరుధునగర్ ఫైట్.. ఆసక్తి రేపుతోంది. శరత్‌కుమార్, రాధిక కలసి పెట్టిన పార్టీని.. కొద్దిరోజుల కింద బీజేపీలో విలీనం చేశారు. ఆ తర్వాత విరుధునగర్ స్థానం నుంచి రాధికా శరత్‌కుమార్‌కు సీటు కేటాయించింది బీజేపీ. ఐతే విరుధునగర్‌పై అన్నాడీఎంకే ఫోకస్ పెట్టింది. రాధికాకు చెక్ పెట్టేలా.. విజయ ప్రభాకరన్‌కు టికెట్ ఇచ్చింది. ఈయన ఎవరో కాదు.. డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నేత, హీరో విజయ్‌కాంత్ కుమారుడు. పొత్తులో భాగంగా అన్నాడీఎంకే ఆ సీటును డీఎండీకేకు ఇచ్చింది. కెప్టెన్ మరణం తర్వాత.. సింపతీ వర్కౌట్ అవుతుందని ఆ పార్టీ నేతలు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారు. ఇక ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎంపీ, తెలంగాణ పార్టీ మాజీ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ పోటీ చేయబోతున్నారు.
ఇలా విరుధునగర్ నుంచి ఇప్పుడు సమ ఉజ్జీలు బరిలో దిగడంతో.. పోరు ఆసక్తికరంగా మారింది. ఇక రాధిక రాజకీయ ప్రస్థానం 2006లో ప్రారంభమైంది. తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి ఆమె అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది ఆ పార్టీ నుంచి వారిని తొలగించారు. 2007లో వారు AISMK పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో రాధిక సేవలు అందించారు. కొద్దిరోజుల కిందే AISMKను బీజేపీలో విలీనం చేశారు.